ప్రతి ఒక్కరికి భారత జట్టుకి ఆడాలనే కల ఉంటుంది. కొందరికి ఆ అవకాశం చాలా తొందరగానే వచ్చినప్పటికీ మరి కొందరికి మాత్రం చాలా ఏళ్లు పడుతుంది. కొందరైతే ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండడం మనం చూశాం.
ఇటీవలి కాలంలో యువ క్రికెటర్స్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐపీఎల్‌లోనే లేదంటే చిన్న చిన్న టోర్నమెంట్‌లో భారత జట్టు తరపున బరిలో దిగే ఛాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఏషియన్ గేమ్స్ లో భాగంగా మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. రవి శ్రీనివాస్ సాయి కిషోర్. నేపాల్‌తో ఈ రోజు జరిగిన మ్యాచ్‌తో ఆయన డెబ్యూ ఇచ్చాడు.
భారత జట్టుకి ఆడుతున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలైన సాయి కిషోర్.. జాతీయ గీతాన్నిఆలపిస్తున్న టైం లో కంట కన్నీరు పెట్టుకున్నారు..ఎన్నో ఏళ్ళు గా ఇండియన్ జర్సీ వేసుకోవాలి అని కలలు కన్న అతనికి ఇలా చాన్స్ దక్కడంతో ఆయన కంటి నుండి ఆనంద భాష్పాలు వరదాల పారాయి.
సాయి కిషోర్ ని అలా చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అయ్యారు. ఎన్ని కోట్లు పెట్టిన దొరకని ఆనందం ఇన్నాళ్లకి సాయికిషోర్‌కి రావడంతో ఆయన కంటి నుండి ఆనందభాష్పాలు అలా వచ్చేశాయి. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక 26 ఏళ్ళ సాయి కిషోర్ ఎడమచేత్తో బౌలింగ్ చేస్తూ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. బంతులని గిరగిర తిప్పుతూ బ్యాట్స్‌మెన్స్‌ని ఇబ్బంది పెట్టాడు. అలానే కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. రానున్న మ్యాచ్‌లలోను సాయి కిషోర్ ఇలానే తన అద్భతమైన ప్రతిభ చూపిస్తే రానున్న రోజులలో ఇండియా మెయిన్ టీం కి కూడా తప్పక ఎంపిక అవుతాడని అంటున్నారు.
సాయి కిషోర్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. బెంచ్‌కే ఎక్కువగా పరిమితం కావల్సి వచ్చింది. 2023 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ టీం తరుపున బరిలోకి దిగిన ఈ ఆటగాడు గుజరాత్ టీం విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఛాన్స్‌లు ఇస్తే తన సత్తా చూపించుకోవడానికి సాయి కిషోర్ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తున్నాడు.