Site icon vidhaatha

Samantha | నా జీవితం బాగోలేదు.. ఇన్ని ఇబ్బందులు ప‌డ‌తాన‌ని ఊహించ‌లే: స‌మంత

Samantha |

ఏ మాయ చేశావే సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన స‌మంత ఆ స‌మ‌యం నుండే కుర్రాళ్ల క‌ల‌ల రాణిగా మారింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. కెరీర్ స‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో నాగ చైత‌న్య‌ని ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్ల త‌ర్వాత అత‌నికి విడాకులు ఇచ్చింది. ఆ డిప్రెష‌న్ నుండి తేరుకునే స‌మ‌యంలో స‌మంత‌కి మ‌యోసైటిస్ ఉన్న‌ట్టు తేలింది.

ఈ వ్యాధితో కొన్నాళ్లుగా పోరాడుతూ వ‌స్తుంది స‌మంత‌. అయితే కొద్ది రోజులుగా సినిమాల‌కి దూరంగా ఉంటున్న స‌మంత తాజాగా త‌న ఫాలోవ‌ర్స్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించింది. ఆ స‌మ‌యంలో అనేక విష‌యాలు పంచుకుంది. తాను ఫ్యాన్స్ కోసం యాక్షన్‌ సినిమా చేస్తానంటూ పేర్కొంది. తన జీవితం ఇలా ఉంటుందని అస్స‌లు ఊహించ‌లేదంటూ పేర్కొంది.

నేటి యువ‌త‌కి స‌ల‌హా ఇస్తూ.. చిన్న చిన్న విష‌యాల‌కి ఏ మాత్రం ఫీల్ కావొద్ద‌ని, ఇప్పుడు మీ జీవితం మొద‌లైంద‌ని చెప్పింది.జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సమస్యలు వస్తాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని స‌మంత స‌ల‌హ ఇచ్చింది.

జీవితంలో ఇలాంటి ఇబ్బందులు పడతానని అస్స‌లు ఊహించ‌లేద‌ని, ఏం జ‌రిగిన కూడా పాజిటివ్ మైండ్‌ తో వెళ్లాలంటూ స‌మంత పేర్కొంది. ఇక యాక్షన్‌ సినిమా చేస్తే చూడాలని ఉందని అభిమాని కోరుకోగా, ‘సిటాడెల్‌’లో యాక్షన్‌ ఉంటుందని, తన పాత్ర హాట్‌గా, ఫన్నీగా ఉంటుందని, ఎంతో సవాల్‌తో కూడుకొని ఉంటుంద‌ని పేర్కొంది.

మీ చర్మం ఇలా ప్రకాశించడానికి కారణం ఏంటని చిన్మయి.. స‌మంత‌కి ప్ర‌శ్న వేయ‌గా, మీరు అనుకుంటు న్న‌ట్టు ఏమి లేదు. మ‌యోసైటిస్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా స్టెరాయిడ్స్ వాడుతున్నాను. దాని వ‌ల‌న చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌తో బాధ‌ ప‌డుతున్నాను. విప‌రీత‌మైన పిగ్మెంటేషన్‌ వచ్చిందని స‌మంత తెలియ‌జేసింది.

నేను ఏదైనా సాధిస్తానని చెప్పిన స‌మంత‌.. పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయని ప్రశ్నించడం మానేసి, యథాతథంగా వాటిని స్వీకరిస్తానంటూ మూడు విష‌యాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ ల గురించి చెబుతూ, ప్రస్తుతం ఇంకా ఎలాంటి ప్లాన్‌ చేయలేదని స్ప‌ష్టం చేసింది.

Exit mobile version