Samantha | సమంతకు క్రేజ్ మామూలుగా లేదు. 2010లో వచ్చిన తమిళచిత్రం ‘విన్నైతండి వరువాయా’ సినీరంగ ప్రవేశం చేసింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది. ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చి వెళ్తున్నా తనదైన నటనతో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నది.
దక్షిణాది సినిమాల్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతూ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్నది. ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ పాటతో తెలుగు ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనే ఊపు ఊపేసింది.
అంతకుముందు ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌లో మెరిసింది. ఇటీవల శాకుంతలం సినిమాలోనూ నటనతో ఆకట్టుకున్నది. ఈ ప్రాజెక్టులతో సమంత ఇండియాలోనే అత్యంత పాపులారిటీ ఉన్న నటిగా మార్చాయి. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి ఓఆర్‌మ్యాక్స్ మీడియా ప్రకటించిన ఓఆర్‌మ్యాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ (All India) జాబితాలో.. ఇండియాలోనే నెంబర్ వన్ మోస్ట్ ఫీమేల్ స్టార్‌గా నిలిచింది.
బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లను తలదన్ని సమంత అగ్రస్థానంలో కొనసాగుతు న్నది. ఈ జాబితాలో అగ్రస్థానాన్ని నిలువడం తొలిసారి ఏమి కాదు. ఇప్పటికే 8 సార్లు ఆమె ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.
అయితే, ఈ జాబితాలో ఆలియా భట్ రెండో స్థానంలో ఉండగా.. దీపికా పదుకొనె మూడు, నయనతార నాలుగు, కాజల్ అగర్వాల్ ఐదు, త్రిష ఆరు, కత్రినా కైఫ్ ఏడు, కియారా అద్వానీ ఎనిమిది, కీర్తి సురేష్ తొమ్మిది స్థానంలో నిలిచింది. టాప్ టెన్ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచింది.
ఈ లిస్ట్‌లో సమంత నంబర్ వన్ ప్లేసులో నిలువడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత తోపు.. దమ్ముంటే ఆపు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లో నటిస్తున్నది. అలాగే హిందీ ‘సిటాడెల్’లో కనిపించనున్నది.