బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృదయకాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఒక స్పూఫ్ కామెడీ లాంటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్.. సంపూర్ణేష్‌ని హీరోగా పరిచయం చేశాడు. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో సంపూ క్రేజ్ బాగానే పెరిగింది.
పలు సినిమాలలో హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ పాత్రలు చేస్తున్నాడు. అయితే సంపూర్ణేష్ బాబుది చాలా పేద ఫ్యామిలీ. ఆయన ఎంత సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నా కూడా చాలా సింపుల్‌గా జీవిస్తుంటారు. ప్రస్తుతం సంపూర్ణేష్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఇందులో సంపూర్ణేష్ సైకిల్ మీద నీళ్లు తీసుకు రావడం, సింపుల్‌గా ఉండడం, ఊరు వాళ్లతో సరదాగా మాట్లాడడం కనిపిస్తుంది. సంపూర్ణేష్ బాబుది తెలంగాణలోని సిద్ధిపేట కాగా, హైదరాబాద్ లో ఓ గోల్డ్ షాప్ లో పని చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించేవాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ట్రై చేసేవాడు.
ఓ సారి ప్రసాద్ ల్యాబ్ లో అక్కడ ఉన్న పలువురికి తన ఫోటోలు ఇచ్చి ఆర్టిస్ట్ గా పరిచయం చేసుకొని ఏమన్నా చాన్సులు ఉంటే ఇమ్మంటూ అడుగుతూ సాయి రాజేష్ కి కూడా తన ఫోటోలు ఇచ్చాడు. ఆ సమయంలో సంపూర్ణేష్ బాబు విచిత్రమైన డ్రెస్ వేసుకొని పిలక, జుట్టుతో చూసి సాయి రాజేష్ కి నచ్చడంతో హృదయ కాలేయం సినిమాకు ఇలాంటి హీరో బెటరైతే బాగుంటుందని అనుకున్నాడట.
ఆ సమయంలో సంపూర్ణేష్‌ని సాయి రాజేష్ హీరోగా చేస్తావా అని అడిగినప్పుడు నేనైతే డబ్బులు ఏమి ఇచ్చుకోలేను అని చెప్పాడట సంపూర్ణేష్ బాబు. అవసర్లేదు నేనే ఇస్తాను అని సాయి రాజేష్ చెప్పి సంపూని హీరోగా తీసుకున్నాడు. అలా హృదయ కాలేయం చిత్రం ఆయన జీవితాన్నే మార్చేసింది. సంపూ మంచి మనసున్న మనిషి. అనేక సమయాలలో చాలా మందికి తనవంతు సాయం కూడా చేశాడు.
ఆయన లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ కామెడీ మూవీతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. తమిళ ‘మండేలా’ రిమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా, సంపూర్ణేష్‌బాబు తలపై కిరీటం ఉండటం, అందులో కొంతమంది నాయకులు ఓట్ల కోసం ప్రచారం చేస్తోన్నట్లుగా డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.