Site icon vidhaatha

ఆయిల్‌ ట్యాంకర్‌ శుభ్రం చేసేందుకు దిగి ఏడుగురు మృతి.. కాకినాడలో విషాదం

seven labors died | కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆయిల్‌ ట్యాంకర్‌ శుభ్రం చేసేందుకు దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. పెద్దాపురం మండలం జీ.రాగంపేట అంబటి సుబ్బన్న ఆయిల్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఈ ఘటన జరిగింది. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు ఒకరి తర్వాత ఒకరు దిగారు.

ట్యాంకర్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయిల్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని పరిశీలించారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

పాడేరుకు చెందిన మృతులను కుర్రా రామారావు(45), వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌, కురతాడు బంజిబాబుగా, పులిమేరుకు చెందిన మృతుల్లో కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version