విధాత: నువ్వు నల్లగా ఉన్నావు.. అందంగా లేవు అని నిత్యం వేధిస్తున్న భర్తపై ఓ భార్య క్రూరంగా ప్రవర్తించింది. నిద్రిస్తున్న భర్తపై గొడ్డలితో దాడి చేసి అతని పురుషాంగాన్ని నరికేసింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. దుర్గ్ జిల్లాకు చెందిన అనంత్ సోన్‌వాని(40), సంగీత సోన్‌వాని(30)కి కొన్నేండ్ల క్రితం వివాహమైంది. సంగీత నలుపు రంగులో ఉండటంతో ఆమెను వేధించేవాడు. అందంగా లేవంటూ ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించేవాడు.
ఈ విషయంలో పలుమార్లు వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే ఆదివారం రాత్రి కూడా దంపతుల తీవ్ర ఘర్షణ జరిగింది. ఇక నిద్రిస్తున్న భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసింది. అతని పురుషాంగాన్ని నరికేసింది.
ఇక తెల్లారిన తర్వాత.. తన భర్తను ఎవరో చంపేశారని స్థానికులకు సంగీత చెప్పింది. అనంత్ పురుషాంగాన్ని కూడా కోసేశారని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని సంగీత అంగీకరించింది.
అనంతరం సంగీతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంత్‌కు సంగీత రెండో భార్య. మొదటి భార్య చనిపోవడంతో.. సంగీతను పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.