Site icon vidhaatha

Siddharth Anand : ‘మైత్రి’ మైండ్ బ్లాక్ చేసిన సిద్ధార్థ ఆనంద్!.. ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్‌?

ఇటీవలే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు సిద్ధార్ధ్ ఆనంద్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

తాజాగా ఆయన పఠాన్ చిత్రంతో తన స్థాయి ఏమిటో మరోసారి నిరూపించారు. వార్ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ లో ప‌ఠాన్ తో వచ్చారు. ఈమధ్య హిట్టుకే నోచుకోని షారుక్ ఖాన్ కి సూపర్ అనిపించే బ్లాక్ బస్టర్ మూవీ అందించారు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

షారుఖ్ అభిమానులకు ఈ చిత్రం ఐఫీస్ట్ లా ఉందంటున్నారు. ఆ విషయంలో సిద్ధార్థ ఆనంద్ స‌క్సెస్ అయ్యారు. దీని తరువాత ఆయన హృతిక్ రోష‌న్ కోసం హీరోగాఫైటర్ చిత్రం చేస్తున్నారు. ఫైటర్ తర్వాత ప్రభాస్ సినిమా ప్రారంభం కానుండగా ప్రభాస్‌తో సిద్ధార్థ చర్చలు కూడా ముగిశాయి.

అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ సినిమాకు డైరెక్ట్ చేసేందుకు సిద్ధార్థ్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో సెన్సేషన్ ట్రాక్ రికార్డు ఏర్పరచుకున్న మైత్రి మూవీ మేకర్స్ హీరో స్థాయిని బట్టి బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు.

సిద్ధార్థ్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుందని, చిత్రం కమర్షియల్‌గా మైత్రి మూవీ మేకర్స్ కు భారీ ప్రాజెక్టు కానుంద‌ని భావిస్తున్నారు. దాంతో పఠాన్ , ఫైట‌ర్ల కంటే ప్ర‌భాస్ సినిమాకి ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుందని భావించిన సిద్ధార్థ్ 150 కోట్లను డిమాండ్ చేస్తున్నారు.

ఒక డైరెక్టర్ 150 కోట్లు అంటే అందరూ నోరేళ్ల పెట్టవచ్చు. ఇతను ఏమైనా రాజమౌళినా అనుకోవచ్చు. కానీ బడ్జెట్, హీరో,ఆయా చిత్రాల కమర్షియల్ స్టామినాను బట్టి దర్శకులు కూడా నేడు తమ రెమ్యూనరేషన్‌ను కష్టాన్ని బట్టి ఆశిస్తున్నారు. అలా చూసుకుంటే సిద్ధార్థ ఆనంద్ 150 కోట్లు డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ కనిపించడం లేదు. అంతకుమించిన కష్టాన్ని ఈ చిత్రం కోసం ఆయన పడాల్సి ఉంటుంది.

ప‌ఠాన్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత సిద్ధార్ధ్ ఆనంద్‌తో కమిట్ కావాలని మైత్రి నిర్మాతలు వెయిట్ చేశారు. ఈ చిత్రానికి ఎలాగూ పాజిటివ్ టాక్ వ‌చ్చింది. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటున్నారు. దాంతో ఏదిఏమైనా సిద్ధార్ద్ ఆనంద్‌తోనే కలిసి వెళ్లాలని మైత్రి మూవీ మేకర్స్ కూడా సిద్ధపడుతుంది. ఏది ఏమైనా మైత్రి వారికే మైండ్ బ్లాక్ అయ్యేలా రెమ్యూనేషన్ అడిగి షాక్ ఇచ్చారు డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్. అలాగే త‌న పంతం కూడా నెగ్గించుకుని రెండు విధాలుగా స‌క్సెస్ అయ్యారు

Exit mobile version