Site icon vidhaatha

Sreemukhi: శ్రీముఖి పెళ్లికి వేళాయెనా.. అత‌డిని చేసుకోబోతుందా..!

Sreemukhi: తనదైన చలాకీతనంతో కుర్రకారు మనసు దోచుకున్న అందాల యాంక‌ర‌మ్మ‌ శ్రీముఖి.. బుల్లితెర అల్లరి పిల్లగా ఫుల్ ఫేమ‌స్ అయిన శ్రీముఖి త‌న మాట‌ల‌తో పాటు అంద‌చందాల‌తో అల‌రిస్తుంటుంది. వెండితెరపై అవకాశానందుకొని సినిమాల‌లో న‌టించిన శ్రీముఖి ఆ త‌ర్వాత బుల్లితెర‌పై అడుగుపెట్టింది. ప‌టాస్ అనే షో ఈ అమ్మ‌డికి మంచి పేరు తీసుకురాగా, ప్ర‌స్తుతం ఛానెల్‌తో సంబంధం లేకుండా షోస్ చేస్తుంది. మరోవైపు సోష‌ల్ మీడియాలో కూడా ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్రాక‌రుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది శ్రీముఖి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి వ‌యస్సు 30 ప్ల‌స్ కావ‌డంతో పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు వ‌స్తున్నాయి.

శ్రీముఖి హైద‌రాబాద్‌కి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ని పెళ్లి చేసుకోనుంద‌ని, త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు ఓ ఫొటోగ్రాఫ‌ర్‌తో శ్రీముఖి ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌ని, త్వ‌ర‌లోనే వారిద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. అయితే గతంలో కూడా శ్రీముఖి పెళ్లి వార్తలు వైర‌ల్ కాగా, దీనిపై ఆమె స్వయంగా రియాక్ట్ అయింది. తనకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్ప‌ట్లో లేద‌ని చెప్పిన కూడా శ్రీముఖి పెళ్లి వార్త‌లు నిత్యం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి.

ఇక శ్రీముఖి ప్ర‌స్తుతం ప‌లు షోస్‌తో బిజీగా ఉండ‌గా, ఎప్ప‌టిక‌ప్పుడుడ తన షో స్ కు సంబంధించిన లుక్స్ తో ఫోటోషూట్ చేయించుకుంటూ, ఆ ఫొటోల‌ని నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. పొట్టి దుస్తుల‌తో పాటు ట్రెడిషనల్ లుక్ లో కూడా దర్శనమిస్తూ నానా హంగామా చేస్తుంది శ్రీ. ఆ మ‌ధ్య‌న ఈ భామ క్రేజీ అంకుల్స్ అనే చిత్రంతో వెండితెర‌పై కూడా సందడి చేసింది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం అటువైపు దృష్టి పెట్ట‌డం లేదు. అయితే ఈ అమ్మ‌డికి భోళా శంకర్ చిత్రంలో మంచి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ద‌క్కింద‌ని, ఆ రోల్ శ్రీముఖికి మంచి పేరు తెసుంద‌ని అంటున్నారు.

Exit mobile version