Site icon vidhaatha

ఆ హీరోయిన్ బుగ్గ ట‌క్కున కొరికిన నాగార్జున‌..సెట్స్ నుండి ప‌రుగులు

సినిమా షూటింగ్స్ స‌మయంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. రొమాంటిక్ స‌న్నివేశాలు చేసేట‌ప్పుడు కొంద‌రు చేయ‌మ‌న్న‌ది కాకుండా కాస్త అతిగా ప్ర‌వ‌ర్తించ‌డం, దాని వ‌ల‌న హీరోయిన్స్ హ‌ర్ట్ అయి సెట్స్ నుండి వెళ్లిపోవ‌డం అనేది మ‌నం చూస్తూనే ఉన్నాం.


ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి నాగార్జున‌, ట‌బు విష‌యంలో జ‌రిగింది. టాలీవుడ్ న‌వ మ‌న్మ‌థుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున హీరోయిన్స్‌తో ఎంతో జోవియ‌ల్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంతో మంది హీరోయిన్స్‌తో ఎన్నో సినిమాల‌లో రొమాన్స్ చేశారు. అయితే ఓ సంద‌ర్భంలో హీరోయిన్ బుగ్గ చ‌టుక్కున కొరికేయ‌డంతో ఆమె సెట్స్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారింది.


ఒక‌ప్పుడు టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున‌, ట‌బు క‌లిసి నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ వంటి చిత్రాలు చేశారు. ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన నిన్నే పెళ్లాడ‌తా సినిమాలో ఈ ఇద్ద‌రు ముఖ్య పాత్రలు పోషించ‌గా, ఈ చిత్రం అతి పెద్ద విజ‌యం సాధించింది.



ఇందులో నాగార్జు- ట‌బు కెమిస్ట్రీకి మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమాకి సందీప్ చౌతా అందించిన సంగీతం కూడా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారింది. అయితే ఈ మూవీలో జ‌రిగిన ఒక విచిత్ర సంఘ‌ట‌న అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. నాగార్జున‌- ట‌బు క‌లిసి ఓ రొమాంటిక్ సన్నివేశంలో న‌టిస్తుండ‌గా, ఆ స‌మ‌యంలో నాగార్జున ట‌బు బుగ్గ కొర‌కాల్సి ఉండ‌గా, ఆయ‌న నిజంగానే ట‌క్కున కొరికేశాడ‌ట‌. దాంతో ట‌బు సీరియ‌స్‌గా షూటింగ్ సెట్ నుండి వెళ్లిపోయింది.

ఆ త‌ర్వాత ట‌బుకి న‌చ్చ‌జెప్పి తిరిగి షూటింగ్ సెట్స్ కి తీసుకొచ్చార‌ట‌.ఆ త‌ర్వాత అస‌లు విష‌యం నాగార్జున‌- ట‌బుకి చెప్ప‌డం ఆమె అర్ధం చేసుకోవ‌డంతో త‌ర్వాత ఇద్ద‌రు ఫ్రెండ్స్ అయ్యారు. అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ని, కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ రూమ‌ర్స్‌ని నాగార్జున ప‌లు మార్లు కొట్టిపారేసారు. తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు.


టబు నా భార్యకు కూడా మంచి ఫ్రెండ్ కాబ‌ట్టి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అమలను, నన్ను కలుస్తుందని ఓ సంద‌ర్భంలో స్ప‌ష్టం చేశారు. చెప్పుకొచ్చారు. టబు ..బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ తో కూడా ఆమె ఘాడమైన ప్రేమాయణం నడిపారనే ప్ర‌చారం ఉంది. ఆమె ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోక‌పోవ‌డంపై అనేక అనుమానాలు ఉన్నాయి.

Exit mobile version