Tamannaah Bhatia |
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నది. బాలీవుడ్ వరుస వెబ్‌సిరీస్‌లు చేస్తున్నది. ఇటీవల ‘జీ కర్దా’ సిరీస్‌లో మెరిసింది. ఇందులో రొమాంటిక్ సీన్స్‌తో నటించగా.. బ్యూటీ.. మరోసారి లస్ట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.
ఇందులో రియల్ లైఫ్‌లో తన ప్రియుడైన విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్-2కి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. తమన్న మరింత బోల్డ్ సీన్స్‌లో నటించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తున్నది. వెబ్ సిరీస్ విడుదల కానుండగా.. ప్రమోషన్‌కు సంబంధించిన ప్రోమోను తమన్నా సోషల్ మీడియాలో విడుదల చేసింది.
ఈ వీడియోలో మాట్లాడుతూ.. తల్లిద్రండులతో పాటు అందరి ప్రేమ ఉంది. లస్ట్ స్టోరీస్-2 జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది’ అంటూ చెప్పింది. అయితే, ప్రోమో మొదటల్లోనే తమన్నా విజయ్‌తో కలిసి లిప్‌లాక్‌తో పాటు బోల్డ్ సీన్స్‌లో కనిపించింది. అందులో తమన్నా ముద్దు సీన్లపై నెటిజన్స్ మండి పడుతున్నారు. ఇంతకు ముందెన్నడూ తమన్నా ఇలాంటి సీన్లలో నటించడం చూడలేదంటూ అభిమానులే ముక్కున వేలేసుకుంటున్నారు.
పలువురు నెటిజన్స్ ‘భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు’ పలువురు మండిపడ్డారు. మరికొందరు ‘నిన్ను ఇలా చూస్తున్నందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరు మీరు సీ-గ్రేడ్ నటులతో ఇలాంటి సీన్స్ ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకొకరు స్పందిస్తూ.. ‘తమన్నా కోలీవుడ్, టాలీవుడ్‌కు తిరిగి రండి’ అంటూ విజ్ఞప్తి చేయగా.. ఇలాంటి సిరీస్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా.. 2018లో విడుదలైన లస్ట్ స్టోరీస్‌కు కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్-2 తెరకెక్కింది. ఇందులో తమన్నాతో పాటు మృణాల్ ఠాకూర్, కాజోల్ దేవగణ్ కీలకపాత్రలో పోషించారు. లస్ట్ స్టోరీస్-2 ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది.