Site icon vidhaatha

Maadhavi Latha | ఆ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నా..! పెళ్లి గురించి అస్సలు అడగొద్దు..! నటి మాధవీ లత పోస్ట్‌ వైరల్‌..!

Maadhavi Latha |

విధాత: సినీ పరిశ్రమలో ప్రేమలు, డేటింగ్‌లు, పెళ్లిళ్లు చివరకు.. విడాకులు సైతం సర్వసాధారణం. పలువురు నటీనటులు ఎక్కడ ఎవరితోనైనా కనిపిస్తే.. మా మధ్య ఏమీ లేదు అని చెప్పి దాచేందుకు యత్నిస్తుంటారు. కానీ, కొందరే ధైర్యంగా అవును ఇద్దరం డేటింగ్‌ చేస్తున్నామని లేదంటే రిలేషన్‌లో ఉన్నామని చెప్పి షాకిస్తుంటారు. తాజాగా హీరోయిన్‌ మాధవీ లత సైతం అలాంటి కామెంట్స్‌ చేసి అందరికీ షాకిచ్చింది.

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక సమస్యలపై పోరాడుతూనే ఉంటుంది. అయితే, ఫేస్‌బుక్‌లో మాధవీ లత పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని చెప్పింది.

మాధవీలత 2008లో ఉషాకిరణ్ మూవీస్ నుంచి వచ్చిన ‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత స్నేహితుడా, చూడాలని చెప్పాలని, అరవింద్‌-2 తదితర చిత్రాల్లో నటించింది. అయితే, ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరమైంది. 2018లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

బీజీపీలో చేరి ఎన్నికల్లో సైతం పోటీ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. తెలుగు బ్యూటీ తాజాగా ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇది అంత త్వరగా జరిగే పని కాదు. అసలు అతడిని నేను పెళ్లి చేసుకుంటానో లేదో..? పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆ వ్యక్తి తెలుగు వ్యక్తి కాదు. ముఖ్యంగా నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను’ అంటూ పోస్ట్‌ పెట్టింది. అయితే, మీరు అనుకునే వ్యక్తి అయితే.. అతడు కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌ వైరల్‌ కాగా.. ఆ వ్యక్తి ఎవరా? అని ఆరా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Exit mobile version