Site icon vidhaatha

Priyanka Nalka | మలేషియాలో సీక్రెట్‌గా.. ప్రియుడిని పెళ్లాడిన తెలుగు నటి..!

Priyanka Nalkari |

విధాత: తెలుగు నటి హైదరాబాదీ ప్రియాంక నల్క పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యులకు తెలియకుండానే తన ప్రియుడు రాహుల్‌ వర్మతో రహస్యంగా ఏడడుగులు వేసింది. ఈ ఇద్దరి వివాహానికి మలేషియాలోని ఓ ఆలయం వేదికైంది. ఈ మేరకు ఫొటోలను ప్రియాంక తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారాయి. అభిమానులతో పాటు నెటిజన్లు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రియాంక పెళ్లి చేసుకున్న రాహుల్‌ వర్మ ఓ వ్యాపారవేత్త. అలాగే పలు సీరియల్స్‌లో నటించగా, ఇద్దరూ ఓ తమిళ సీరియల్‌లో సైతం కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి.. చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు.

తెలంగాణ యాసలో వచ్చిన పలు యూ ట్యూబ్‌ షార్ట్ ఫిలిమ్స్‌తో వెలుగులోకి వచ్చిన ప్రియాంక 2010లో విడుదలైన శర్వానంద్‌ ‘అందరి బంధువయ’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘కాంచన-3’, ‘కిక్‌2’ (Kick 2) తదితర సినిమాల్లోనూ నటించింది.

తెలుగు, తమిళ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటించింది. ఆహ్వానం, మేఘమాల, మంగమ్మగారి మనువరాలు వంటి సీరియల్స్‌లో నటించింది. తమిళంలో రోజా, చంద్రలేఖ, లక్ష్మీస్టోర్స్‌, కన్ననా కన్నేతో పలు సీరియల్స్‌లో నటించగా.. ‘రోజా’ సీరియల్‌తో తమిళనాట విశేష గుర్తింపు సంపాదించింది.

Exit mobile version