విధాత, క్రీడలు: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగబోతున్నది. జట్టు కొత్త సారధిగా దక్షిణాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మార్క్రమ్‌ను నియమించింది. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో టైటిల్ నెగ్గిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మార్క్రమ్ నాయకత్వంలో జట్టు లీగ్‌లో అద్భుతంగా రాణించింది.
ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతనికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. అయితే, ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పేరును ఫ్రాంచైజీ పేరును వినూత్నంగా వెల్లడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎవరో అంటూ ట్విట్టర్ వేదికగా చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఇందులోని కొన్ని కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌తో మార్క్రమ్ స్కెచ్‌ను రూపొందించిన సన్ రైజర్స్.. తమ నూతన సారథి మార్క్‌రమ్‌కు హాలో చెప్పండంటూ క్యాప్షన్‌ను పెట్టింది. ఇంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఆ తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలయమ్సన్ సైతం కెప్టెన్‌గా వ్యవహరించారు.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram