Site icon vidhaatha

మెరుపు వేగం అంటే ఇదేనేమో.. చీతా వీడియో వైర‌ల్

Cheetah | భూమిపై అత్యంత వేగంగా ప‌రుగెత్త‌గ‌ల జీవులు ఏవంటే.. చీతాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాకెట్ వేగంతో చీతాలు దూసుకెళ్ల‌గ‌ల‌వు. గంట‌కు 60 కిలోమీట‌ర్ల వేగంతో చీతాలు ప‌రుగెత్త‌గ‌ల‌వు. ఓ చీతా మెరుపు వేగంతో దూసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాసినేటింగ్ పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

ఫ్యాసినేటింగ్ పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసిన చీతా వీడియోను చూస్తుంటే.. అద్భుత‌మ‌నిపిస్తుంది. అస‌లు భూమ్మీద కూడా కాలు పెట్టుకుండా చీతా పరుగెత్తుతుంది. ఈ చీతా ఏకంగా గంట‌కు 70 మైళ్ల వేగంతో ప‌రుగెత్తుతుంద‌ని రాసుకొచ్చారు. అంటే 112 కిలోమీట‌ర్ల వేగం అన్న‌మాట‌. చీతా వేగాన్ని చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికి 33 లక్షల మందికిపైగా వీక్షించారు. వేలల్లో లైక్స్‌ వచ్చాయి.

Exit mobile version