ఏడ్చే వారికి ఏడ్చినంత‌.. అక్క‌డ ప్ర‌త్యేక క్ర‌యింగ్ రూమ్స్‌..!

మ‌నిషి జీవితం ఎన్నో ర‌కాల ఎమోష‌న్స్‌తో ముడిప‌డి ఉన్న‌ది. న‌వ్వు, ఏడుపు, ఆందోళ‌న వంటి విష‌యాలు మ‌న జీవితంలో స‌హ‌జం. మన జీవితాల్లో ఆనందం వ‌చ్చిన‌పుడు న‌వ్వ‌డం చేస్తాము అలాగే బాధ క‌లిగిన‌ప్పుడు ఏడ‌వ‌డం, ఒంట‌రిగా గ‌డ‌ప‌డం చేస్తుంటాము

  • Publish Date - March 22, 2024 / 02:09 PM IST

వాషింగ్ టన్: మ‌నిషి జీవితం ఎన్నో ర‌కాల ఎమోష‌న్స్‌తో ముడిప‌డి ఉన్న‌ది. న‌వ్వు, ఏడుపు, ఆందోళ‌న వంటి విష‌యాలు మ‌న జీవితంలో స‌హ‌జం. మన జీవితాల్లో ఆనందం వ‌చ్చిన‌పుడు న‌వ్వ‌డం చేస్తాము అలాగే బాధ క‌లిగిన‌ప్పుడు ఏడ‌వ‌డం, ఒంట‌రిగా గ‌డ‌ప‌డం చేస్తుంటాము. అయితే చాలా మంది మాత్రం న‌వ్వినంత ఈజీగా ఏడ‌వ‌డం చేయ‌రు. ఎవ‌రైనా చూస్తార‌నో, ఏమైనా అనుకుంటార‌నో ఏడ‌వ‌కుండా వారిలో వారే కృంగిపోతారు. అలాంటి వారికోస‌మే అమెరికాలో ప్ర‌త్యేక పార్ల‌ర్లు ఏర్పాటు చేశారు.


న‌లుగురిలో ఏడ్వ‌కుండా కుంగిపోయే వారు ఇక్క‌డికి వ‌చ్చి బోరున‌ ఏడ‌వ‌చ్చు అన్న‌మాట‌. వీటిని సోబ్ పార్ల‌ర్లుగా పిలుస్తున్నారు. న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ సోబ్ పార్ల‌ర్ల‌లో కావ‌లిసినంత సేపు త‌నివి తీరా ఏడ్చి రావ‌చ్చు, వీటిని ఆంథోనీ విలోట్టి అనే వ్య‌క్తి మొద‌లు పెట్టారు. ప్ర‌స్థుత బిజీ లైఫ్‌లో చాలా మంది ఒత్తిడి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని, ఆఫీసుల్లో, ఇండ్ల‌లో త‌లెత్తే ప‌లు స‌మ‌స్య‌ల కార‌ణంగా ఏడ‌వాల‌ని భావిస్తారు. కానీ అంద‌రి ముందు ఏడ‌వ‌డానికి నిరాకరిస్తుంటారు. అచ్చంగా అలాంటి వారికోస‌మే ఈ ప్ర‌త్యేక పార్ల‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు ఆంథోని వెల్ల‌డించారు. ఏడ‌వ‌టం మూలంగా ఒత్తిడి త‌గ్గుతుంద‌ని శాస్త్రవేత్త‌లు కూడా తెలిపారు.

Latest News