Site icon vidhaatha

బెంజ్ కారు ఢీకొట్ట‌డంతో.. రెండు ముక్క‌లైన ట్రాక్ట‌ర్ ఇంజిన్

విధాత: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రేణిగుంట – చిత్తూరు బైపాస్ ర‌హ‌దారిపై మూడు రోజుల క్రితం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళ్తున్న బెంజ్ కారు.. రాంగ్ రూట్‌లో వ‌చ్చిన ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్ట‌ర్ ఇంజిన్ రెండు ముక్క‌లైంది. ట్రాలీ భాగం కూడా మ‌రో చోట ప‌డిపోయింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కేఏ 04 ఎంయు 3456 నంబర్ గల బెంజ్ కారు తిరుపతి నుంచి చిత్తూరు వైపునకు వెళ్తుంది. అదే స‌మ‌యంలో బైపాస్‌పై రాంగ్ రూట్‌లో వ‌చ్చిన ట్రాక్ట‌ర్ యూట‌ర్న్ తీసుకునేందుకు య‌త్నిస్తుండ‌గా, వేగంగా వ‌చ్చిన బెంజ్ కారు ఢీకొట్టింది.

బెంజ్ కారు ఎడ‌మ వైపు భాగం స్వ‌ల్పంగా దెబ్బ‌తింది. ట్రాక్ట‌ర్ ఇంజిన్ రెండు భాగాలుగా ముక్క‌లైంది. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌కు గాయాల‌య్యాయి. దీంతో అన్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బెంజ్ కారు 100 నుంచి 120 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

Exit mobile version