Site icon vidhaatha

ట్రంప్‌ Vs నిక్కి హేలి..! న్యూ హాంప్‌షైర్‌ కాకస్‌పైనే దృష్టి..!

Trump Vs Nikki Haley | డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో రిపబ్లిక్‌ పార్టీలో అభ్యర్థిత్వం కోసం పోటీపడుతుండగా.. ఇప్పటికే అయోవా కాకస్‌ ఓటింగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేశారు. దాంతో ట్రంప్‌, ఆయన మద్దతుదారులు ఉత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం అందరి దృష్టి న్యూ హాంప్‌షైర్‌ కాకస్‌ ఎన్నికలపై నెలకొన్నది. న్యూ హాంప్‌షైర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌, నిక్కి హేలీ సైతం మధ్య పోటీ హోరాహోరీగా ఉండనున్నదని తెలుస్తున్నది. ఈ కాకస్‌ ఎన్నికల నుంచి రాన్‌ డిసాంటిస్‌ వైదొలగాలని భావిస్తున్నారు. ఆయన సౌత్‌ కరోలినా కాకస్‌ దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 23న న్యూ హ్యాంప్‌షైర్‌లో ఓటింగ్‌ జరుగనున్నది.


ఈ ఎన్నికలో ట్రంప్‌, నిక్కి హేలీకి చెరో 40శాతం ఓట్లు దక్కనున్నానయి తెలుస్తున్నది. న్యూ హాంప్‌షైర్ గవర్నర్ క్రిస్ సునును నిక్కి హేలీకి మద్దతు తెలిపారు. ఇక్కడ గెలవాలంటే ట్రంప్‌ గట్టిగానే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15న అయోవా కాకస్‌ ఎన్నికల్లో డోనాల్‌ ట్రంప్‌నకు 51శాతం ఓట్లు వచ్చాయి. రాన్ డిసాంటిస్‌ను 21 శాతం, నిక్కి హేలీ 19 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామికి 7శాతం ఓట్లురాగా.. ఆయన ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఇటీవల కాలంలో నిక్కి హేలీకి ప్రజాదరణ పెరుగుతున్నది.


న్యూ హాంప్‌షైర్‌లో ఆమె ట్రంప్‌ను ఓడించినా.. సౌత్‌ కరోలినాలో సవాల్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సౌత్‌ కరోనాలినా ఆమె సొంత రాష్ట్రం. ఇక్కడ రెండుసార్లు గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉంది. రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల కోసం బరిలో నిలవాలనికుంటున్న రాన్‌ డిసాంటిస్‌ సైతం ఈ రాష్ట్రంపైనే దృష్టి సారించారు. ఇదిలా ఉండగా.. డెమొక్రాట్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ను రిపబ్లికన్‌ పార్టీ నుంచి తాను మాత్రమే ఓడించగలనని స్పష్టం చేశారు. డోనాల్డ్‌, ట్రంప్‌ మధ్య జరిగిన వివాదాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇద్దరి మధ్య పోటీ ఉంటే మరోసారి రిగ్గింగ్‌తో పాటు అరాచకాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.

Exit mobile version