ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు వైవిధ్యమైన షోలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆహాలో కొద్ది రోజుల క్రితం బాలయ్య బాబు హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అనే షో మొదలైన విషయం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్‌గా ఓ షో వస్తుంది అంటే అందరు అవాక్కయ్యారు. షో అట్లర్ ఫ్లాప్ అవుతుందని కొందరు తప్పుడు ప్రచారాలు చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయింది. తొలి సీజన్‌లో సినిమా సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేసిన బాలకృష్ణ సెకండ్ సీజన్‌లో మాత్రం పొలిటికల్ లీడర్స్‌ని కూడా ఇంటర్వ్యూ చేశారు.
నందమూరి బాలకృష్ణ తనదైన హోస్టింగ్ తో ఆసక్తికర ప్రశ్నలు అడగడమే కాకుండా గెస్ట్‌లకి తికమక పెడుతూ ఫుల్ వినోదం పంచాడు. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తుండగా, సీజన్ 3 సీజన్ 3 కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని , త్వరలో ఈ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. మూడో సీజన్ లో మరికొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్య మరింత జోష్ గా ఈ సీజన్ ను నడిపించనుండగా, సీజన్ 3 మొదటి ఎపిసోడ్‌కి ఎవరు గెస్ట్‌గా వస్తారనే సందేహం అందరిలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ 3 మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్టు తెలుస్తుండగా, ఇందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. చిరంజీవి, బాలయ్య ఒకే వేదికపై కనిపించక చాలా రోజులు అయింది. అన్‌స్టాపబుల్ సీజన్ 3లో ఈ ఇద్దరు కలిసి కనిపిస్తే అభిమానులకి పండగే అని చెప్పాలి. మరి ఈ వార్త నిజమైతే ఈ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు మూడో సీజన్‌లో రామ్ చరణ్, మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారని తెలుస్తుంది.