Baby Girl | ఆ వంశస్తులు ఆడబిడ్డ( Baby Girl ) కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ మగ పిల్లలే( Baby Boys ). ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయిన అందరికీ మగ పిల్లలే జన్మించారు. కానీ ఒక్క అమ్మాయి కూడా జన్మించడం లేదు. ఆ ఇంట అమ్మాయి పుట్టక 138 ఏండ్లు గడిచాయి. ఎట్టకేలకు 138 ఏండ్ల తర్వాత ఆ ఇంట ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. మరి ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలంటే అమెరికా వెళ్లక తప్పదు.
అమెరికా( America )లోని మిషిగాన్‌లోని కలడోనియాలో క్లార్క్ అనే వంశానికి చెందిన కుటుంబం నివసిస్తోంది. అయితే ఆ వంశంలో చివరిసారిగా 1885లో అమ్మాయి పుట్టింది. ఇక అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆడిపిల్లనే పుట్టలేదు. చివరకు 138 ఏండ్ల తర్వాత కరోలిన్, ఆండ్రూ క్లార్క్ దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. దీంతో క్లార్క్ కుటుంబ సభ్యులంతా సంతోషంలో మునిగిపోయారు. కరోలిన్, ఆండ్రూ దంపతులకు మొదటి కాన్పులో మగ పిల్లాడు జన్మించగా, రెండో కాన్పులో అమ్మాయి పుట్టింది.
ఈ సందర్భంగా కరోలిన్ మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులంతా ఆడబిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. తన భర్త ఆండ్రూ చెప్పినప్పుడు నమ్మలేదు. అత్తమామలను ఆరా తీశాను.. వారు కూడా తమ ఇంట్లో ఆడబిడ్డ లేదని ఆవేదన చెందారని తెలిపింది తాను గర్భం ధరించినప్పుడు అమ్మాయి పుడుతుందా..? అబ్బాయి పుడుతాడా..? అనే విషయాన్ని ఆలోచించలేదు. కానీ అమ్మాయి పుట్టడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ పాపకు ఆడ్రీ అని నామకరణం చేసినట్లు కరోలిన్ తెలిపింది.