Site icon vidhaatha

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జ‌గ‌న్ చెప్పింది నిజ‌మే క‌దా.. వ‌ర్మ షాకింగ్ కామెంట్స్

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు చాలా వాడివేడిగా ఉన్నాయి. ఒకరిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయం మ‌రింత హీటెక్కిస్తున్నారు. వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా, ఇక జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌ల‌లో ప‌వ‌న్ పెళ్లిళ్ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా సామ‌ర్ల‌కోట‌లో జ‌రిగిన స‌భ‌లో ద‌త్తపుత్రుడు అంటూ పవన్ పైన పంచ్‌లు వేస్తూ ఆయ‌న‌ ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటుందని..కానీ, ఇల్లాలు మాత్రం ప్రతీ మూడేళ్లకు ఒకసారి మారిపోతారని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక సారి లోకల్..ఇంకోసారి నేషనల్..మరోసారి ఇంటర్నేషనల్ అంటూ ఎద్దేవా చేసారు.ఇక ఈ ద‌త్త‌పుత్రుడు ఏపీలో దోచుకోవటం..హైదరాబాద్ లో పంచుకోవటం అలవాటుగా మారింద‌ని విమ‌ర్శ‌లు చేసారు.


దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో వ్యాపారానికి మాత్ర‌మే ఇక్క‌డికి వస్తాడని ముఖ్యమంత్రి మండిప‌డ్డారు. ప్యాకేజీ స్టార్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం తో సంబంధము లేదు.. గాజువాక తో ఆయ‌నకి అనుబంధం లేదని సీఎం జ‌గ‌న్ అన్నారు. సరుకులు..సరంజామా అమ్ముకొనే వాళ్లను చూసాము..కానీ, సొంత పార్టీని..వర్గాన్ని అమ్ముకొనే వ్యాపారిని మాత్రం ఇక్క‌డే చూస్తున్నామ‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి వివాహ వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం లేద‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే సీఎం జ‌గన్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ ఏపీ, తెలంగాణ‌లో చ‌ర్చనీయాంశంగా మారగా, జ‌గ‌న్ కామెంట్స్‌ని కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. మరి కొంద‌రు మాత్రం మ‌ద్దతు ఇస్తున్నారు.


ఇటీవ‌ల ఓ ప్రెస్ మీట్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ‌ పాల్గొన‌గా,ఆయ‌న‌కు జ‌గ‌న్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ప్ర‌శ్న ఎదురైంది. దానికి స్పందించిన వ‌ర్మ‌.. జ‌గ‌న్ అన్న‌ది నేను చూడ‌లేదు. ఎవ‌రో చెబితే విన్నాను. ఆయ‌న ఏ కాంటెక్ట్స్‌లో అన్నారో నాకు తెలియ‌దు అని వ‌ర్మ అన్నారు. ఆయ‌న డైరెక్ట్‌గానే ఒక సారి లోకల్..ఇంకోసారి నేషనల్..మరోసారి ఇంటర్నేషనల్ అని కామెంట్ చేశార‌ని రిపోర్ట‌ర్ అన‌గా, దానికి స్పందించిన వ‌ర్మ అది నిజ‌మే క‌దా ఒక‌సారి తెలుగు, ఇంకోసారి హిందీ,మ‌రోసారి ఫారెన్ లాంగ్వేజ్ అమ్మాయిని చేసుకున్నాడు. జ‌గ‌న్ అన్న‌ది క‌రెక్టే క‌దా. అందులో త‌ప్పేముంది అన్న‌ట్టు వ‌ర్మ చెప్పుకొచ్చారు. ఇప్పుడు వ‌ర్మ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Exit mobile version