Tabassum | బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటి తబస్సుమ్(78) గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ అధికారికంగా వెల్లడించారు. శుక్రవారం రాత్రి తబస్సుమ్ రెండు నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తబస్సుమ్ మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
తబస్సుమ్.. మన దేశంలో ఫస్ట్ టీవీ టాక్ షో హోస్ట్‌గా పాపులరిటీ సంపాదించింది. అయితే 10 రోజుల క్రితం షూటింగ్ చేశారమె. వచ్చే వారం కూడా షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఇటీవలే ఆమె ఎసిడిటీతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురై చనిపోయింది తబస్సుమ్.
తబస్సుమ్ చైల్డ్ యాక్టర్‌గా 1947లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దూరదర్శన్‌లో వచ్చిన ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ సెలబ్రిటీ టాక్ షోకు 1993 వరకు హోస్ట్‌గా చేశారు. మనదేశంలో మొదటి టీవీ టాక్ షో ఇది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నర్గిస్ మూవీలో నటించింది. మెరా షహగ్, మంఝుదార్, బరి బెహన్, లేటర్ ఇన్ దీదర్ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 1990లో వచ్చిన స్వర్గ్ తబస్సుమ్ చివరి సినిమా.