Site icon vidhaatha

స్టార్ హీరో విజయ్‌ లియో సినిమాకి నిర‌స‌న సెగ‌.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

కోలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. ఆ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమాపై అంచ‌నాలు భారీగా ఉండ‌గా, ఆ అంచ‌నాలు అందుకునేలా మేక‌ర్స్ సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ అంటూ చూడ‌ని లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

 విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం..అలాగే విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావ‌డంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. టాకీ పార్ట్‌ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్‌ సహా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జ‌రుపుకుంటుంది.

పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా, మూవీకి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో నెట్టింట ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. చిత్రాన్ని కేర‌ళ‌లో బాయ్‌కాట్ చేయ‌మంటూ సోషల్ మీడియాలో KeralaBoycottLEO అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

అయితే ఈ సినిమాని కేరళలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఏ మొచ్చింది అనే దాని గురించి చ‌ర్చ జ‌రుపుతున్నారు. కేరళలోని కొందరు మోహన్ లాల్ అభిమానులు, విజయ్ అభిమానులు మధ్య మాటల యుద్దం జ‌ర‌గ‌గా, ఇద్దరూ కలిసి నటించిన జిల్లా చిత్రంలో విజయ్ నటన మోహన్ లాల్ ముందు తేలిపోయిందని అన్నారు. ఇది తమిళ విజయ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు.

మోహన్ లాల్ నటన కూడా చాలా చిత్రాల్లో చెత్తగా ఉందంటూ క్లిప్ లు, ఫోటోలు షేర్ చేయటం మొదలెట్టారు. ఉద్య‌మంలా మోహ‌న్ లాల్‌ని ట్రోల్ చేస్తూ విజ‌య్ ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. దీంతో మా మోహ‌న్ లాల్‌ని అంటారా అని మా కేరళలో మీ హీరో సినిమా ఆడనివ్వం అంటూ …#KeralaBoycottLEO అంటూ హ్యాష్ టాగ్ ట్రెండ్ చేయటం మొదలెట్టారు.

దీంతో విజయ్ కు ఉన్న యాంటి ఫ్యాన్స్ షేర్ చేయటం,రీ ట్వీట్ చేయటం మొదలెట్ట‌డంతో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. లియో చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న త్రిష‌, ప్రియా ఆనంద్ న‌టిస్తున్నారు. సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Exit mobile version