Site icon vidhaatha

మ‌ళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న విరాట్‌, అనుష్క దంప‌తులు..!

మ‌ళ్లీ పేరెంట్స్ కాబోతున్న విరాట్‌, అనుష్క దంప‌తులు..!బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ జంట ఒక‌టి. వీరి జంట‌ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అయితే ఈ జంట‌కి ఓ చిన్నారి జ‌న్మించ‌గా, ఇంత వ‌ర‌కు ఆమెని ప్ర‌పంచానికి క‌న‌ప‌డ‌కుండా పెంచ‌తున్నారు. అనుష్క‌, విరాట్ ల బేబిని చూడాల‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా కూడా వారు మాత్రం త‌మ బిడ్డ పిక్స్ బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు.




అయితే ఇప్పుడు విరాట్, అనుష్క దంప‌తులు మ‌రోసారి పేరెంట్స్ కాబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. నెల రోజుల క్రితమే అనుష్క ఇందుకు సంబంధించినట్టుగా పరోక్షంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం అనుష్క ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమే కావచ్చు. ప్రస్తుతం అనుష్క, కోహ్లి రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది.



ప్రెగ్నెన్సీ కారణంగానే అనుష్క గత కొన్ని నెలలుగా కొన్ని సామాజిక కార్యక్రమాలు, ఫంక్షన్‌లకు దూరంగా ఉంటుంది. అంతే కాదు రీసెంట్‌గా ఓ ఆసుపత్రి దగ్గర వీరిద్దరూ కనిపించడంతో వార్త కన్ఫామ్ అని అభిమానులు కూడా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.



ఇటీవ‌ల ముంబైలోని ప్రసూతి ఆసుపత్రి వెలుపల అనుష్క కనిపించడంతో ఆమె గర్భం దాల్చిన వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఆ స‌మ‌యంలో త‌మ‌ని ఫోటోలు తీయవద్దని ఫోటోగ్రాఫర్‌ని కోరింది. త్వ‌ర‌లో ఈ విష‌యాన్ని తామే తెలియ‌జేస్తామ‌ని అనుష్క చెప్పిన‌ట్టు స‌మాచారం.


ఇక 2021లో కోహ్లీ దంపతులకు వామిక అనే బిడ్డ జన్మించిన విష‌యంవ తెలిసిందే. వారి కూతురు వామిక ఫొటోలను వారు ఇంత‌వ‌ర‌కు సోషల్ మీడియాలో షేర్ చేయడంలేదు. ఇక విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం 2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టుతో ఉన్నాడు.



ఈ ప్రపంచకప్ ముగిసే వరకు అతడు టీమ్ ఇండియాతో బిజీగా ఉండనున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత, స్టార్ జంట ఈ సంతోషకరమైన ఆలోచనను పంచుకునే అవ‌కాశం ఉంది. ఈ సారి టీమిండియా వ‌రల్డ్ క‌ప్ సాధించాల‌ని, అందులో విరాట్ కీల‌క భాగం కావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.



గ‌త ఏడాది దారుణ‌మైన ఫామ్‌లో ఉన్న విరాట్ ఇప్పుడు తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇక అనుష్క ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉంటూ త‌న ఫ్యామిలీ బాగోగుల‌పై మాత్ర‌మే దృష్టి పెట్టింది.


Exit mobile version