విధాత: ఎన్నికలకు సమాయత్తం అవుతున్న జగన్ అన్నిరకాలుగా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. వై నాట్ 175 (175 సీట్లు గెలుద్దాం) అనే ట్యాగ్ లైన్ మీద ప్రచారాన్ని మొదలు పెట్టిన జగన్ చంద్రబాబును కుప్పంలో టైట్ చేస్తే ఆయన అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదని, ఆయన్ను స్టేట్ మొత్తం తిరగడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడే ఫుల్ టైట్ చేసి భయ పెట్టాలన్నది జగన్ వ్యూహం లా ఉంది.
ఈ నేపథ్యంలో కుప్పంలో ఇన్‌చార్జి భారత్ బాగా యాక్టివ్‌గా పని చేస్తున్నప్పటికీ ఇంకా.. బెటర్ క్యాండిడేట్ ఉంటే బాగుండని, మొత్తానికి చంద్రబాబును బెంబేలెత్తించాలని జగన్ వ్యూహం పన్నుతున్నారు. ఈ క్రమంలో సీమ జిల్లాకు చెందిన సినీ నటుడు విశాల్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నారని అంటున్నారు.
విశాల్ తండ్రికి ఆ ప్రాంతంలో భారీగా వ్యాపారాలు, విస్తృత సామాజిక పరిచయాలు ఉండడంతో ఆయన గెలుపు అవకాశాలు బాగానే ఉంటాయని ఆశిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఫీలర్స్, రూమర్స్ వచ్చినా విశాల్ వాటిని సున్నితంగా ఖండిస్తూ వచ్చారు. తనకు జగన్ అంటే అభిమానం ఉంది కానీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని గతంలో చెప్పారు.
కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారో, రాజకీయల మీద ఇంట్రెస్ట్ పెరిగిందో తెలీదు కానీ నేడు మంగళ వారం జగన్ను విశాల్ కలుస్తున్నారని అంటున్నారు. అంటే ఆయన పోటీకి ఒప్పుకున్నారా.. వేరే ఏదైనా పనిమీదనో ..ఇంకెందుకో కలుస్తున్నారా అని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పటికే అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్‌ను జగన్ ప్రకటించారు. భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని స్పష్టం చేశారు. భరత్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కానీ మళ్ళీ ఇప్పుడు విశాల్ ను తీసుకొస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.