Site icon vidhaatha

వనపర్తి మునిసిపాలిటీలో ఖాళీ అయిన బీఆరెస్‌

wanaparthi

ఎమ్మెల్యే మేఘారెడ్డి, మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్‌లో 8 మంది కౌన్సిలర్లు

విధాత వనపర్తి బ్యూరో : వనపర్తి సెగ్మెంట్ లో ఉన్న వనపర్తి, పెబ్బేరు మున్సిపల్ బీఆరెస్‌ కాంగ్రెస్ పార్టీ బాట పట్టారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆదివారం 8మంది బీఆర్ ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన కౌన్సిలర్లకు మేఘా రెడ్డి, మల్లు రవి పార్టీ కండువాలను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచానని తనను వనపర్తి నియోజకవర్గంలోని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాల న్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చు వనపర్తి ప్రజలు తనను 25వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పారు. అదే తరహాలో వనపర్తి నియోజకవర్గం నుంచి 50వేల భారీ మెజారిటీ ఇచ్చి మల్లు రవిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, కౌన్సిలర్లు వెంకటేష్, విభూది నారాయణ, సత్యం సాగర్, జయసుధ మధు, లక్ష్మీ రవి యాదవ్, సుమిత్ర యాదగిరి, బ్రహ్మం చారి, నాయకులు లక్కాకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version