Site icon vidhaatha

లోయ‌లో ప‌డ్డ పెళ్లి బ‌స్సు.. 32 మంది దుర్మ‌ర‌ణం

విధాత: ఉత్త‌రాఖండ్‌లోని పౌరి గ‌ర్హ‌వాల్‌లో నిన్న రాత్రి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 32 మంది మృతి చెందారు. మ‌రో 21 మంది స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. రెస్క్యూ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి, గాయాల‌పాలైన 21 మందిని స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించింది.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 40 మందికి పైగా ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. లాల్‌ధంగ్ జిల్లాలో పెళ్లి వేడుక‌లు ముగిసిన అనంత‌రం.. తిరిగి వ‌స్తుండ‌గా సిమ్‌ది గ్రామ స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. రాత్రంతా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version