మేష రాశి : క్రీడాకారులకు శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. వైద్య రంగంలోని వారికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శుభకార్యములను ఆచరిస్తారు. సత్ప్రవర్తనతో వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వృద్ది వలన ఆనందిస్తారు. కార్య నిర్వహణా సామర్థ్యముసు చూపుతారు. సుఖహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.
వృషభ రాశి : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదర వర్గ సహకారం లభిస్తుంది. చిక్కులన్నీ ఒక్కొక్కటిగా తొలుగుతుంటాయి. నూతన కార్యములకు శ్రీకారం చుడతారు. ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. మీరు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గణపతి ఆరాధన శుభం కలిగిస్తుంది.
మిథున రాశి : వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగాలలో అవమానములు ఎదురుకావచ్చును. స్థిరాస్థి మూలకంగా నష్టములు కలుగవచ్చును. సోమరితనం వలన ఇబ్బందులెదురవుతాయి. మిన్నుల్ని అభిమానించే సన్నిహిత వ్యక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశము. వృధా ధన వ్యయము కలుగవచ్చును.
కర్కాటక రాశి : అజీర్ణ సంబంధమైన ఇబ్బందుల వలన శరీర బాధలు కలుగవచ్చును. స్థిరాస్థి ప్రయత్రములు ఫలిస్తాయి. రుణములను తీరుస్తారు. సత్ప్రవర్తన మూలకంగా గౌరవం పెరుగుతుంది. దైవ సంబంధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్థులకు.. కొత్త ఆలోచనలు కలుగుతాయి. లక్ష్మీనారాయణుల ఆరాధన మరింత మేలు చేస్తుంది.
సింహ రాశి : భాగస్వాములతో వివాదాలను పరిష్కరించుకోండి. మనశ్శాంతి కరువు అవుతుంది. వాహన మూలకంగా ఇబ్బందులు కలుగవచ్చును. గాంభీర్యము తగ్గుతుంది. నీరసం ఎక్కువౌతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు బాధిస్తాయి. వాత సంబంధమైన నొప్పులు వుంటాయి. ప్రయత్నాకార్యములన్ని ఆలస్యమవుతుంటాయి. దుర్గా ఆరాధన కష్టాలను తొలగిస్తుంది.
కన్యా రాశి : నూతన గృహనిర్మాణము ప్రయత్నములు సానుకూలంగా సాగుతాయి. ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటారు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. రాదనుకున్న సొమ్ము రావడం మూలాన ఆనందం కలుగుతుంది. క్రీడాకారులు ధైర్యంగా ముందడుగు వేసిన విజయాలు లభిస్తాయి. దైవ కార్యక్రములలో పాల్గొంటారు. గణపతి ఆరాధన శుభములు చేకూరుస్తుంది.
తులా రాశి : పని ఒత్తిడి పెరుగుతుంది. సరియైన ఆలోచనలు లేక తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశము. చెప్పుడుమాటలు వినకండి. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం వలన అశాంతి కలుగుతుంది. ఇంట్లో వారిపై అపవాదులు రావచ్చును. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు జాగ్రుత్తులు పాటించాలి. శివారాధన వలన ఇబ్బందులు తగ్గుతాయి.
వృశ్చిక రాశి : రుణములను తీరుస్తారు. బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శత్రువులు మిత్రులయ్యే అవకాశము. పెద్దవారిని గౌరవిస్తారు. నూతన స్నేహములు లాభిస్తాయి. మీ కింద పనిచేసే వారి మూలకంగా సంతోషం కలుగుతుంది. ప్రయత్న కార్యములు కొంతసానుకూలంగా సాగుతాయి. సుబ్రహ్మణ్యారాధన శుభములను కలిగిస్తుంది.
ధనుస్సు రాశి : బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. క్రయవిక్రయముల మూలకంగా లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో మార్పులు సంతోషాన్నిస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయం ఆనందాన్నిస్తుంది. అపవాదులను తొలగించుకుంటారు. కుటుంబ మూలక సౌఖ్యముంటుంది. లలిత ఆరాధన మేలు చేస్తుంది.
మకర రాశి : మోసపోయే ప్రమాదం వున్నది, జాగ్రత్తగా వుండండి. గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందలను వినవలసి వస్తుంది. భోజన సౌఖ్యము లేనందున ఇబ్బందులు కలుగవచ్చును. పని లేకపోవడం వలన మనోవ్యధ కలుగుతుంది. దుర్జనులతో స్నేహం మంచిది కాదు. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చును. విష్ణు ఆరాధన ధైర్యాన్నిస్తుంది.
కుంభ రాశి : ఉద్రేకపడకండి. సోదర వర్గముతో విభేదాలు రావచ్చును. అనుమానములతో బంధు మిత్రుల విరోధములు కలుగవచ్చును. ప్రయత్న కార్యములు ఫలించవు. ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకోని చిక్కులు రావచ్చును. మిత్రుల చేతిలో మోసపోవుట బాధ కలిగిస్తుంది. మనో విచారములు కలుగవచ్చును. ఆంజనేయస్వామి ఆరాధన కష్టాలను తగ్గిస్తుంది.
మీన రాశి : శుభకార్యములను ఆచరిస్తారు. నూతన వస్తువులను సంగ్రహిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ది వుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధువుల మూలకంగా గౌరవమర్యాదలను పొందుతారు. వాదనలలో పై చేయి సాధిస్తారు. అనుకొని వ్యక్తుల నుండి ధనము చేతి కందుతుంది. మనోల్లాసము వుంటుంది. దూర ప్రాంతముల నుండి శుభవార్తలను వింటారు. లక్ష్మీ ఆరాధన కీర్తి, సౌభాగ్యములను కలిగిస్తుంది.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి, కూకట్‌పల్లి, హైదరాబాద్, ఫోన్ నంబర్ : +91 99490 11332