వాట్సాప్‌ ఛానెల్‌లో మరో ఫీచర్‌..! త్వరలో యూజర్లందరికీ ఆల్బమ్‌ ఫీచర్‌.. అందుబాటులోకి..!

ప్రముఖ సోషల్‌ మీడియా మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ లాంచ్‌ చేసిన వాట్సాప్‌ ఛానెల్‌కు భారీగా స్పందన లభిస్తున్నది.

  • Publish Date - December 18, 2023 / 05:17 AM IST

WhatsApp Feature | ప్రముఖ సోషల్‌ మీడియా మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ లాంచ్‌ చేసిన వాట్సాప్‌ ఛానెల్‌కు భారీగా స్పందన లభిస్తున్నది. టెలిగ్రామ్‌కు పోటీగా కంపెనీ దీన్ని తీసుకువచ్చింది. తాజాగా వాట్సాప్‌ ఛానెల్‌కు మరో సరికొత్త ఫీచర్‌ను జోడించింది. వాట్సాప్​ ఛానెల్​లో ప్రస్తుతం ఒకే ఒక్క ఫొటోను, వీడియోను షేర్‌ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. నార్మల్‌ వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను ఒకేసారి ఎక్కువగా షేర్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.


దీన్ని ఆటోమెటిక్‌ ఆల్బమ్‌ ఫీచర్‌గా పిలుస్తుంటారు. ఆటోమెటిక్‌ ఆల్బమ్‌ ఫీచర్‌ను ఛానెల్‌లో సైతం వాట్సాప్‌ తీసుకువస్తున్నది. ఆండ్రాయిడ్​ బీటా అప్‌డేట్‌ వర్షెన్​ 2.23.26.16లో అందుబాటులో ఉంది. బీటా టెస్టర్లకు సైతం అందుబాటులోకి వచ్చింది. సక్సెస్‌ అయితే, త్వరలోనే వాట్సాప్‌ ఛానెల్‌ ఫీచర్‌కు జోడించనున్నట్లు సమాచారం. మల్టిపుల్​ ఫొటోలు, వీడియోలు చూసేందుకు ఛానెల్​ ఫాలోవర్స్​ వాటిని సులభంగా డౌన్​లోడ్​ చేసుకునేందుకు వీలుంటుంది. యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ని మెరుగుపరిచి, మీడియా కంటెంట్స్​ని ఒకేసారి షేర్​ చేసుకునేందుకు ఈ ఫీచర్​ని తీసుకొస్తున్నట్టు వాట్సాప్​ తెలిపింది.


ఈ ఆటోమెటిక్​ ఆల్బమ్​ ఫీచర్​ ఛానెల్​ ఓనర్స్​కి, ఫాలోవర్స్​కి ఉపయుక్తంగానే ఉంటుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అటు ఓనర్స్​ తమ ప్రెజంటేషన్​ని మరింత మెరుగ్గా ఇవ్వొచ్చని, మరో వైపు ఇటు ఫాలోవర్లు సైతం వాటిని సులభంగా యాక్సెస్​ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. వాట్సాప్‌ ఛానెల్‌కు భారత్‌లో భారీగా స్పందన లభిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల సీఎంలతో పాటు సినీ తారలు, క్రికెటర్లు, మీడియా ఛానెల్స్‌ సైతం వాట్సాప్‌ ఛానెల్‌ను వినియోగిస్తున్నాయి.

Latest News