Site icon vidhaatha

Visakhapatnam | విశాఖలో.. వైసీపీ నుంచి ఇంకో వికెట్ డౌన్?

Visakhapatnam |

విధాత‌: విశాఖనగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంకో వికెట్ డౌన్ అయ్యేలా ఉంది. నగరంలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లనూ గత ఎన్నికల్లో టీడీపీకి అప్పగించేసి వైఎస్సార్ కాంగ్రెస్ ఇక రానున్న ఎన్నికల్లో ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. ఈమధ్యనే విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.

అయితే.. ఆయనకు అక్కడ టికెట్ దక్కడం కూడా కష్టమే అని అంటున్నారు. పెందుర్తి నుంచి పోటీకి రమేష్ బాబు రెడీ అయి, పవన్ కళ్యాణ్ తో మాట్లాడుకుని జనసేనలో చేరారు. అయితే అక్కడ అప్పటికే నాలుగుసార్లు గెలిచి మొన్న 2019లో ఓడిపోయినా బండారు సత్యనారాయణ మూర్తి మళ్ళా పోటీకి రెడీ అవుతున్నారు. ఆయన్ను కాదని జనసేనకు అక్కడ టికెట్ ఇస్తారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు

ఇపుడు మరో వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ సైతం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. 2009లో గెలిచిన అయన 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జగన్ పార్టీ నుంచి పోటీచేసి మళ్లోసారి ఓడిపోయారు. అయినా సరే ఆయనకు ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు.

అయితే అయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడి అరెస్ట్ అయి కేసులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా అయన గతంలో గెలిచినా విశాఖ పశ్చిమ స్థానంలో మళ్ళీ ఆయనకు సీటిచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అక్కడ ఇంఛార్జిగా విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కు పార్టీ పగ్గాలు ఇచ్చారు. దీంతో అయన ఆయన వైసీపీ మీద గుర్రుగా ఉన్నారు. దాంతో ఆయన తన అనుచరులతో కలసి జనసేనలోకి వెళ్లి పోటీ చేయాలని చూస్తున్నారు కానీ టికెట్ దక్కడం కష్టమే అంటున్నారు.

ప్రస్తుతం విశాఖ వెస్ట్ నుంచి మూడుసార్లు గెలిచిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు. ఆయన్ను కాదని విజయప్రసాద్ కు టికెట్ దక్కే ఛాన్స్ లేదు కానీ మరి ఏ ఆశతో వెళ్తున్నారో అర్థం కానీ పరిస్థితి . మరి ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా హామీ ఇచ్చారో తెలియదు. మొత్తానికి విశాఖలో వైసిపికి మరో దెబ్బ తగిలేలా ఉంది.

Exit mobile version