Site icon vidhaatha

117వ పుట్టిన రోజు జరుపుకొన్న మరియా బ్రన్యాస్‌ మోరీరా


స్పెయిన్ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డుల్లో ఉన్న మహిళ ఇటీవల తన 117వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఆమె పేరు మరియా బ్రన్యాస్ మోరీరా. స్పెయిన్‌లోని వేరోనాలో నివసిస్తున్నారు. మరియా రెండు ప్రపంచ యుద్ధాలు, చాలామంది నియంతలు, కరోనా వైరస్ యుగాన్ని కూడా చూశారు. ఇప్పుడు ఆమెకు 11 మంది మునిమనవళ్లు ఉన్నారు. వాస్తవానికి మానవుల సగటు వయసు 72.27 సంవత్సరాలు. అయితే రోజురోజుకు ప్రజల సగటు జీవితకాలం పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. 2050 నాటికి మానవుల సగటు వయసు 77 ఏళ్లకు పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.


మరియాకు కోవిడ్ సోకినప్పుడు ఆమె వయసు 113 సంవత్సరాలు. కరోనాతో జరిగిన యుద్ధంలో మారియా గెలిచారు. కరోనా మహమ్మారి ఎంతోమంది పిల్లలు, వృద్ధుల ప్రాణాలను కూడా తీసింది. మహమ్మారిని ఎదిరించి తన 117వ పుట్టినరోజును జరుపుకొన్నారు. మరణం ఎదురుగా ఉన్నప్పుడే జీవితం ప్రాముఖ్యం మరింత అర్థమవుతుందని మరియా తన జీవితసారాన్ని వడబోసి చెప్పారు. మరియా వృద్ధాప్య రహస్యాలను బయటపెడతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఇంతటి వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండటంపై మరియా గతేడాది మరియా మాట్లాడుతూ.. జీవన శైలి ప్రాముఖ్యం గురించి నొక్కొ చెప్పారు. శాంతి, కుటుంబం, స్నేహితులతో సత్సంబంధాలు, ప్రకృతి పట్ల ప్రేమ, భావోద్వేగ స్థిరత్వం, విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటమే తన జీవిత రహస్యాలని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులలో ఇప్పటికే చాలామంది 90 ఏళ్ళు దాటి జీవించారు. జనవరి 2023 నుండి మరియా అత్యంత వయోవృధ్ధురాలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశారు. మరియా తరచుగా తన కుమార్తె సహాయంతో ఎక్స్ (ట్విట్టర్లో) యాక్టివ్‌గా ఉంటారు.

Exit mobile version