Site icon vidhaatha

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

విధాత: ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి మరోసారి గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. మేకపాటి గుండెలో రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్టు సమాచారం. వైద్యులు సైతం మేకపాటిని చెన్నై తీసుకువెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.

Exit mobile version