Site icon vidhaatha

Woman Quits Govt Job | ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసిన యువతి – మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యం

PNB Officer Vaani Resigns, Says No Regrets in Leaving Govt Job

Screenshot

Woman Quits Govt Job | డబ్బు, హోదా, సమాజంలో గౌరవం – ఇవన్నీ ఒక ప్రభుత్వ ఉద్యోగంతో వస్తాయి. కానీ ఢిల్లీలోని 29 ఏళ్ల వాణి అనే యువతి మాత్రం, ఆర్థిక స్థిరత్వం కన్నా మానసిక ప్రశాంతత ముఖ్యమని నమ్మి తన ప్రభుత్వ బ్యాంక్‌ ఉద్యోగాన్ని వదిలేసింది.

2022లో IBPS పరీక్ష ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (PNB)లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమితురాలైన వాణి, ఒక సంవత్సరం శిక్షణ తర్వాత మీరట్‌లో Scale One Officer‌ గా పనిచేయడం మొదలుపెట్టింది. అక్కడ ఆమెకు లోన్స్‌ విభాగపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఉద్యోగం ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చినప్పటికీ, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేసింది.

వాణి సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకుంది. “Not all heroes wear capes… some just quit jobs” అంటూ ఒక పోస్ట్‌లో రాసింది. “నేను ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేదాన్ని. కానీ ఈ మూడు సంవత్సరాల్లో నేను మారిపోయాను. చిరాకుగా, నిస్పృహతో ఉంటున్నాను. చివరికి, డబ్బు కన్నా మానసిక ప్రశాంతత ముఖ్యం అని అనిపించింది” అని వాణి చెప్పింది.

తన నిర్ణయం ఎవరినీ నిరుత్సహపరచడానికి కాదని, ప్రతి ఒక్కరి అనుభవం వేరుగా ఉంటుందని కూడా చెప్పింది. ” నా వద్ద Plan B లేకపోయినా, నా కుటుంబం పూర్తి సహకారం అందించింది. వారు నా కష్టాలను చూశారు. ఈ ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డానో వారికి తెలుసు. అందుకే నేను వదిలేస్తే, నిజంగానే సంతృప్తి లేనన్న విషయం వారు అర్థం చేసుకున్నారు” అని వాణి చెప్పింది.

ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఇలా రాసింది – “People need to stop glorifying working under pressure.” అంటే, ఒత్తిడిని ఎదుర్కోవడమే గొప్పతనమని చెప్పడం ఆపాలని సూచించింది.

 

ప్రస్తుతం వాణి తన భాగస్వామి సావీతో కలిసి @pestolicious అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీని నడుపుతోంది. ఈ పేజీకి 80 వేల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో Food, Travel, Lifestyle కంటెంట్‌ షేర్ చేస్తూ, జీవనశైలిని ఆనందంగా చూపిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం వదిలేయడం ఒక సాధారణ విషయం కాదు. కానీ వాణి లాంటి యువతులు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ సంఘటన సూచిస్తోంది. ఆర్థిక స్థిరత్వం ఎంత ముఖ్యమైనదైనా, ప్రశాంతత లేకపోతే దానికి విలువ లేదని వాణి తన నిర్ణయంతో రుజువు చేసింది.

Exit mobile version