National Doctor’s Day 2024 | జ‌బ్బుల‌ను నయం చేయడమేకాదు.. మనసులూ గెలవాలి

ప్ర‌తీ సంవ‌త్స‌రం జూలై 1న డాక్ట‌ర్స్ డే గా సెల‌బ్రేట్ చేస్తారు. అల‌నాటి లెజెండ‌రీ ఫిజీషియ‌న్ డాక్ట‌ర్ బిదాన్ చంద్ర రాయ్ జ‌యంతి, వ‌ర్ధంతి రెండూ క‌లిసిన ఈ రోజునే వైద్యుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటాం.

  • Publish Date - July 1, 2024 / 12:01 AM IST

డాక్ట‌ర్స్ డే ప్ర‌త్యేకం.. జ‌బ్బుల‌ను న‌యం చేయ‌డం మాత్ర‌మే కాదు.. రోగుల మ‌న‌సుల‌ను గెల‌వ‌డం కూడా వైద్యుల విధి

ఆరోగ్యంగా ఉండే వ్య‌క్తి బ‌ల‌మైన శ‌రీరాన్ని క‌లిగి ఉండ‌ట‌మే కాదు… మాన‌సికంగా కూడా బ‌లంగా ఉంటాడు. అలాంటి వ్య‌క్తులే జాతి అభివృద్ధి, స్వాతంత్య్రాల‌కు చాలా అవ‌స‌రం.

– డాక్ట‌ర్ బి.సి. రాయ్‌

మ‌నిష‌న్నాక జీవితంలో ఎప్పుడో ఏదో ఒక జ‌బ్బు రాకుండా ఉండ‌దు. అందుకే ప్ర‌తి మ‌నిషీ గుర్తు పెట్టుకోవాల్సిన మ‌నిషి ఒక‌రున్నారు. ఆ వ్య‌క్తే.. డాక్ట‌ర్‌. క‌నీసం ప‌ది, పదిహేనేళ్ల‌యినా క‌ష్ట‌ప‌డి చ‌దివితే గానీ ప‌రిణ‌తి చెందిన డాక్ట‌ర్ కాలేరు. వ్య‌క్తిగ‌త జీవితాన్ని వ‌దులుకుని, ప‌గ‌లూ రాత్రీ.. ప‌రిగెత్తుకుని వ‌చ్చి.. త‌న వైద్యం ద్వారా ప్రాణాలు పోసే ఘ‌న‌మైన వైద్యుల సేవ‌ల్ని త‌ప్ప‌నిస‌రిగా గుర్తు చేసుకోవాల్సిందే.

అందుకే ప్ర‌తీ సంవ‌త్స‌రం జూలై 1న డాక్ట‌ర్స్ డే గా సెల‌బ్రేట్ చేస్తారు. అల‌నాటి లెజెండ‌రీ ఫిజీషియ‌న్ డాక్ట‌ర్ బిదాన్ చంద్ర రాయ్ జ‌యంతి, వ‌ర్ధంతి రెండూ క‌లిసిన ఈ రోజునే వైద్యుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటాం. భార‌తీయ వైద్య చ‌రిత్ర‌లో కీల‌క పాత్ర పోషించిన‌ డాక్ట‌ర్ రాయ్, ప‌శ్చిమ బెంగాల్ కి రెండ‌వ ముఖ్య‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప్ర‌జారోగ్యం పెంపొందించ‌డానికి ఆయ‌న చేసిన కృషి అపారం.

ఈ సంవ‌త్స‌రం డాక్ట‌ర్స్ డే థీమ్…. హీలింగ్ హ్యాండ్స్‌, కేరింగ్ హార్ట్స్‌. డాక్ట‌ర్ అంటే.. అవ‌స‌ర‌మైన మందులేవో ప్రిస్క్రైబ్ చేయ‌డ‌మో, ఆప‌రేష‌న్ చేయ‌డం మాత్ర‌మే కాదు. పేషెంట్ల‌కు ఒక సౌక‌ర్య‌వంత‌మైన కేర్ అందించేవారు. జ‌బ్బుల‌ను న‌యం చేయ‌డం మాత్ర‌మే కాదు.. రోగుల మ‌న‌సుల‌ను గెల‌వ‌డం కూడా వైద్యుల విధి.

టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ.. వైద్య రంగంలో కూడా విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు వ‌చ్చాయి. మినిమ‌ల్లీ ఇన్వేసివ్ స‌ర్జ‌రీలు వ‌చ్చిన త‌రువాత చికిత్సా విధానాలు మ‌రింత సులువ‌య్యాయి. వైద్యుల హ‌స్తాల‌కు, రోబో చేతులు తోడ‌య్యాయి. ఎన్ని ఆధునిక ప‌రిక‌రాల‌తో చికిత్స‌లందించినా కూడా.. రోగి చేతిలో చేయి వేసి, నేనున్నాన‌నే భ‌రోసా అందించే డాక్ట‌ర్ చేతి స్ప‌ర్శ ఇచ్చే సాంత్వ‌న కీల‌క‌మైంది. అందుకే అంటారు… వైద్యుల పెదవుల‌పై చిరున‌వ్వు చాలు.. స‌గం జ‌బ్బు న‌యం కావ‌డానికి అని. ్ద‌

క‌ష్టంలో ఉన్న‌ప్పుడే మ‌న‌ల్ని ఆదుకునేవాళ్లెవ‌రో తెలుస్తుంది. ఆప‌ద‌లో వైద్యులు ఎంత కీల‌క‌మ‌వుతారో కొవిడ్ మ‌హ‌మ్మారి స‌మయంలోనే తెలిసింది. ప్రాణాల‌కు తెగించి, ఆ స‌మ‌యంలో వైద్యులు అవిశ్రాంతంగా అందించిన సేవ‌లు.. వాళ్ల‌లోని అసామాన్య‌మైన అంకిత‌భావాన్ని నొక్కి చెప్పాయి. ప్రాణాలు కాపాడ‌టానికి ప్ర‌తిరోజూ వాళ్లెంత శ్ర‌మిస్తున్నారో, త‌మ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఎంత‌గా కోల్పోతున్నారో, త‌మ ప్రాణాలు సైతం అడ్డుగా వేసి ఎలా కాపాడుకున్నారో కొవిడ్ తెలియ‌జెప్పింది. అందుకే ఏ హ హాస్పిట‌ల్ న‌డ‌వాల‌న్నా నైపుణ్యం క‌లిగిన డాక్ట‌ర్లే కాదు.. అంకిత భావంతో సేవ‌లందించే వైద్యులే మూల స్తంభాలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

జ‌స్దీప్ సింగ్‌
సీఈవో
కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిట‌ల్స్‌

Latest News