Site icon vidhaatha

‘పద్మ’ అవార్డుల దరఖాస్తుకు గడువు పొడిగింపు

దిల్లీ: పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ఇవ్వనుంది. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.

Exit mobile version