Arundhati Roy | బుకర్‌ప్రైజ్‌ విజేత అరుంధతీ రాయ్‌కి మరో అరుదైన పురస్కారం..!

Arundhati Roy | నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలతో బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌కి మరో అరుదైన పురస్కారం దక్కింది. అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు 'పెన్‌ పింటర్‌-2024' పురస్కారం అందజేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 10న జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

  • Publish Date - June 28, 2024 / 11:56 AM IST

Arundhati Roy : నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలతో బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌కి మరో అరుదైన పురస్కారం దక్కింది. అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు ‘పెన్‌ పింటర్‌-2024’ పురస్కారం అందజేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 10న జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

అవార్డు స్వీకరించిన అనంతరం అరుంధతీరాయ్‌ ప్రసంగించనున్నారు. ఇంగ్లిష్‌ పెన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో ‘పెన్‌ పింటర్‌’ పురస్కారాన్ని స్థాపించింది. ఈ పురస్కారాన్ని భావప్రకటనా స్వేచ్ఛకు ప్రతీకగా నోబెల్‌ గ్రహీత, నాటక రచయిత హరోల్డ్‌ పింటర్‌ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. తనకు పురస్కారం రావడంపట్ల రాయ్‌ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచం తీసుకుంటున్న అపారమైన మలుపులపై రచనలు చేయడానికి హరోల్డ్‌ పింటర్‌ మనతోనే ఉన్నారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, కశ్మీర్‌పై 14 ఏళ్ల కిందట చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరుంధతీరాయ్‌ మీద పెట్టిన కేసులను ఉపసంహరించాలని భారత ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ విజ్ఞప్తి చేసింది. దేశంలో విమర్శకులపై ఉగ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగించడంపట్ల ఐరాస ఆందోళన వ్యక్తంచేసింది.

Latest News