Site icon vidhaatha

తెదేపా ఆధ్వర్యంలో కొవిడ్‌ బాధితులకు భరోసా కార్యక్రమం

విధాత,అమరావతి: ఏపీలో తెదేపా ఆధ్వర్యంలో నేడు కొవిడ్‌ బాధితులకు భరోసా కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. అన్ని జిల్లాల్లోని కొవిడ్‌ ఆస్పత్రులను తెదేపా నేతలు సందర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌.. తెదేపా నేతలు గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, రాజమహేంద్రవరంలో తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Exit mobile version