విధాత: పోసాని ఇంటిపై రాళ్లదాడి.అమీర్ పేటలోని ఎల్లారెడ్డి గూడలో పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి రాళ్లతో దాడి చేశారు.అయితే గత 8 నెలలుగా పోసాని అక్కడ ఉండకపోవడంతో దాడిపై వాచ్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.