Site icon vidhaatha

Samantha | సమంతను పెళ్లి చేసుకునేందుకు భార్యకు విడాకులు ఇవ్వబోతున్న బాలీవుడ్‌ హీరో..!?

Samantha | ‘ఏమాయే చేసావే’తో తెలుగు తెరకు పరిచయమైన సమంత తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. అందమే కాకుండా అభినయంతోనూ తెలుగు ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్నది. తొలి సినిమాతోనే నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నది.

కొద్దికాలం సజావుగా సాగిన వీరి కాపురం సినిమా తరహాలోనే పెటాకులైంది. విడాకుల తర్వాత నాగ చైతన్యతో పాటు సమంత ఎవరికి వారు కెరియర్‌పై దృష్టి పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. సమంత సినిమాలతో పాటు వరుసగా వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నది.

ఇప్పటికే ఫ్యామిలీ మెన్‌ సిరీస్‌లో బోల్డ్‌గా కనిపించిన సామ్‌.. ప్రస్తుతం మరో వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నది. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నటించిన సిటడెల్‌ ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్‌ను బాలీవుడ్‌లో తెరకెక్కిస్తుండగా.. ఇందులో సమంత ప్రియాంక పాత్రను పోషిస్తున్నది.

బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సెర్బియాలో జరుగుతున్నది. అయితే, షూటింగ్‌ సమయలో విరామం దొరికినప్పుడల్లా సమంత వరుణ్‌ ధావన్‌తో కలిసి షికార్లు చేయడంతో పాటు పబ్‌లకు కలిసి వెళ్లారు. ఇటీవల బెల్‌గ్రేడ్‌ క్లబ్‌లో ఇద్దరు కనిపించి వార్తలో నిలిచారు.

పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ సాంగ్‌కు సామ్‌ చిందులేయగా వరుణ్‌ ధావన్‌ డ్యాన్స్‌ చేయాలంటే ఎంకరేజ్‌ చేశాడు. ఇదిలా ఉండగా.. సమంత, వరుణ్‌ ధావన్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని అనుమానిస్తున్నారు. అయితే, బాలీవుడ్‌లో సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమర్‌ సంధు సంచలన ట్వీట్‌ చేశాడు.

వరుణ్‌ ధావన్‌ తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నాడంటూ ట్వీట్‌ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, సమంతను ప్రేమిస్తున్నాడని, తనను పెళ్లి చేసుకునేందుకే విడాకులు ఇవ్వ బోతున్నాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

Exit mobile version