Site icon vidhaatha

మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా సినీ ప్ర‌ముఖులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

విధాత,హైద‌రాబాద్ :రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుంటూ,తండ్రికి తగిన తనయునిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షునిగా, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులుగా రాణిస్తూ.. తెలంగాణ యువతకు ఐకన్‌గా,పార్టీ నేతలకు మార్గదర్శకులుగా, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల తారక రామునికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెలువెత్తున్నాయి.

మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా సినీ ప్ర‌ముఖులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన వారిలో ద‌ర్శ‌కులు గోపీచంద్ మ‌లినేని, అనిల్ రావిపూడి, బాబీ, ఫిల్మ్ మేక‌ర్ బీవీఎస్ ర‌వి, హీరోలు మ‌హేశ్ బాబు, సందీప్ కిష‌న్, శ‌ర్వానంద్, రామ్ పోతినేని, ర‌వితేజ‌, విష్ణు మంచు,న‌వీన్ పోలిశెట్టి,న‌టి మంచు ల‌క్ష్మి, న‌టుడు రంగ‌నాథ‌న్ మాధ‌వ‌న్,హాస్య న‌టుడు వెన్నెల కిశోర్ ఉన్నారు.

Exit mobile version