Site icon vidhaatha

Corona:4లక్షలు దాటిన కేసులు

విధాత,దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా మరో 42,618 మంది వైరస్‌ బారినపడ్డారు. క్రితం రోజు(45,352)తో పోలిస్తే 6శాతం తక్కువ కేసులు నమోదవడం కాస్త ఊరటనిస్తోంది. ఇక మరణాలు కూడా 400 దిగువనే ఉన్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్లీ 4లక్షలు దాటడం గమనార్హం.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.21కోట్ల మంది కొవిడ్‌ను జయించగా.. రికవరీ రేటు 97.43శాతంగా ఉంది. నిన్న మరో 330 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,40,225 మందిని బలితీసుకుంది.

Exit mobile version