విధాత(విజయవాడ): సుజనా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో వెన్యూ కన్వెన్షన్ లొ 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జీజీహెచ్ అనుబంధంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వాసుపత్రి కి అనుబంధంగా 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సుజనా ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ 24/7 ఆక్సిజన్ తోపాటు వైద్యులు అందుబాటులో ఉంటారని,
100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభంతో కొంతమేర ప్రభుత్వాస్పత్రిపై భారం తగ్గుతుందన్నారు.
ప్రభుత్వ వైద్యులతోపాటు కొంతమంది ప్రైవేట్ వైద్య సిబ్బంది కూడా ఇక్కడ వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇటువంటి సేవలు చేసేందుకు ముందుకు వస్తే వారికి సహకరిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.