Site icon vidhaatha

మతోన్మాద విధానాలపై పోరాటాలకు ఉద్యమ కార్యాచరణ

విధాత‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక,మతోన్మాద విధానాలపై పోరాటాలకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా చాడా వెంకట్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో దేశ స్వాతంత్రోద్యమంతో బిజెపి పార్టీకి సంబంధం లేదు.పెండింగ్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులు పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.

బీజేపీ ప్రభుత్వ మతోన్మాద చర్యలు, కార్పోరేటీకరణ,చమురు ధరల పెరుగుదల,సాగుచట్టాల ఉపసంహరణకు19పార్టీలతో సెప్టెంబర్20నుండి30వరకు దేశవ్యాపిత నిరసన కార్యక్రమాలు.ధరణి పోర్టల్ లోపాలపై సెప్టెంబర్3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనలు.పోడు భూముల సమస్యలపై అఖిల పక్ష పార్టీలతో కలిసి పోరాటాలు.

2014లో సిఎం125 గజాల ఇండ్లస్థలాల కోసం జారీ చేసిన జీ ఓ 58 అమలుకు నోచుకోలేదు.ఇండ్లస్థలాలు,బెడ్రూం ల కోసం చలో కలెక్టర్, మంత్రులకు ఎమ్మెల్యే లకు వినతులు.కృష్ణా గోదావరి జలాల అంశం పై రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమకార్యచరణ.తెలంగాణా రైతాంగ సాయుధ వారోత్సవాల నిర్వహణకు సెప్టెంబర్11నుండి17వరకు బస్సుయాత్ర.నిజాం రాజాకారు దాష్టికానికి గురైన అనేక ప్రాంతాల్లో టూరిజం శాఖ పక్షాన చిహ్నాలను ఏర్పాటు చేసి ఆనాటి త్యాగాలను నేటి తరాలకు తెలియజేయాలి.

Exit mobile version