Site icon vidhaatha

“పెగసస్” పుస్తకావిష్కరణ చేసిన… సిపిఎం బి.వి.రాఘవులు

విధాత:సుందరయ్య విజ్ఞానకేంద్రం పుస్తకాలయంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పెగసస్ స్పై వెర్ ప్రయోగం రాజ్యంగ విరుద్ధమని దీన్ని కేంద్రం ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఎం పోటిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు.స్థానిక సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని పుస్తకాలయంలో “ప్రజాస్వామ్యానికి పెనుముప్పు పెగసస్” పుస్తకాన్ని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెగసస్ గూఢచర్యం దేశంలోని ప్రముఖులైన న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ప్రతిపక్షనాయకులు వంటి వారిపై ప్రయోగించటం రాజ్యంగ విరుద్ధమన్నారు.

కేంద్రం ప్రభుత్వమే ఎన్ ఎస్ ఓ ఇజ్రాయిల్ స్పైవేర్ సంస్థ నుండి తీసుకొని తమకు వ్యతిరేకంగా వున్న వారిపై ప్రయోగిస్తుంది. బిజెపి మంత్రులు సైతం నిఘా నీడలో వున్నారని దేశంలో 40 మందిపై నిఘా పెట్టారని, ఎలక్షన్ కమిషనర్ న్యాయమూర్తులు, ఇతర ప్రతిపక్ష నాయకులు సైతం నిఘా నీడలో వున్నారని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రమాదకర పరిస్థితులకు వ్యక్తిగత స్వేచ్ఛకు, పౌర స్వేచ్ఛకు భంగం వాటిల్లింది. సుప్రీంకోర్టు వెలెత్తి చూపినా, పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నిలదీసినా కేంద్రం మౌనంగా వుంటూ విచారణను తిరస్కరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విధాల్ని బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తోంది.

ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్టం, గో రక్షణ చట్టం రాజ్యాంగ ప్రాథమిక హక్కులు హరించే చట్టాలు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని రాఘవులు అన్నారు. ప్రజలను చైతన్య పరిచే పలు వ్యాసాలతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తెచ్చిన నవతెలంగాణ బుక్ హౌస్ వారిని ఆయన అభినందించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కోయ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరిచే పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం వుందని అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభలో ఐలూ రాష్ట్ర నాయకులు పార్థసారధి, కవి రచయిత తంగిరాల చక్రవర్తి, కిష్టారెడ్డి, ధనలక్ష్మి, సంగీత, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version