Site icon vidhaatha

ప్రియుని కోసం హిజ్రాలతో ధర్నా

ప్రేమించానంటూ వెంటపడ్డాడు.. ప్రేమించిన తర్వాత రెండేళ్లపాటు వెంట తిప్పుకొన్నాడు.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి బుక్కరాయసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన ఓ యువతి (20), రాజ అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె అడుగుతుంటే.. తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అన్ని విధాలుగా మోసపోయానని తెలుసుకున్న యువతి స్థానికులు, ఇంటి పక్కనే ఉన్న హిజ్రాలతో కలసి మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. సదరు యువకుడిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మోసం చేసిన యువకుడు అధికార పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version