Site icon vidhaatha

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ

విధాత,భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. నిన్న 20 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఈ ఉదయానికి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకూ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సహాయం కోసం 93929 19743 నంబరుకు ఫొటోలు వాట్సాఫ్‌ చేయాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజల అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 08744 241950, 08743 23244 సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Exit mobile version