Gold Rates |
బంగారం ప్రియులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మొన్న ధరలు భారీగా పెరగగా.. నిన్న స్థిరంగా కొనసాగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.100 తగ్గి ప్రస్తుతం.. రూ.54,600 వద్ద కొనసాగుతున్నది.
అదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 తగ్గి రూ.59,650 వద్ద ట్రేడవుతున్నది. అదే సమయంలో స్వల్పంగా వెండి ధర సైతం తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.54,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,560కి తగ్గింది.
ముంబుయిలో 22 క్యారెట్ల ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల రూ.59,410 వద్ద కొనసాగుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,840కి చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,510 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,410 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు దేశవ్యాప్తంగా పలునగరాల్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గగా.. హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.100 వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,800 వద్ద ట్రేడవుతున్నది.
మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు 1928 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.30 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.535 వద్ద ట్రేడవుతోంది.