హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. నానీ స్పీచ్‌కు అంద‌రూ ఫిదా

వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న న్యాచుర‌ల్ స్టార్ నానీ.. మాస్, క్లాస్ ఎలాంటి సినిమాల‌నైనా చేయ‌గ‌ల‌న‌నే స‌త్తా చాటుతున్నాడు. ఈ ఏడాది ‘ద‌స‌రా’ సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్నాడు

  • Publish Date - November 30, 2023 / 04:46 PM IST

విధాత‌: వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న న్యాచుర‌ల్ స్టార్ నానీ.. మాస్, క్లాస్ ఎలాంటి సినిమాల‌నైనా చేయ‌గ‌ల‌న‌నే స‌త్తా చాటుతున్నాడు. ఈ ఏడాది ‘ద‌స‌రా’ సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి త‌న‌ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌తో జ‌త క‌ట్టాడు. తండ్రీకూతుళ్ల మ‌ధ్య ప్రేమ‌ నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న చిత్రం ‘హాయ్ నాన్న‌’. ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఈసినిమా ఉండ‌నున్న‌ది. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ప‌నులన్నీ పూర్తి చేసుకొని డిసెంబ‌ర్‌-7వ తేదీన‌ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ది. బుధ‌వారం రాత్రి జ‌రిగిన ‘హాయ్ నాన్న‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నానీ స్పీచ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానున్న సినిమా గురించి మాట్లాడుతూ, త‌నదైన శైలిలో అంద‌రినీ ఆక‌ర్షించాడు.

తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో ర‌న్‌బీర్ క‌పూర్‌, ర‌ష్మికా మంద‌న్నాల‌తో తీస్తున్న యానిమ‌ల్‌, ప్ర‌భాస్ స‌లార్‌, నితిన్ ఎక్స్ట్రార్డిన‌రీ మ్యాన్, రాజ్‌కుమార్ హిరానీ చేసిన డంకీ, సుమ కుమార‌డు డెబ్యూ మూవీ బ‌బుల్‌గ‌మ్ సినిమాలు కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టాల‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపాడు. దీంతో తెలుగు ప్రేక్ష‌కులంతా నానీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. నానీ క‌ల్మ‌షం లేని వ్య‌క్తి, త‌న సినిమా ఎప్ప‌టిలాగే ఈసారి కూడా హిట్ అవుతుంద‌ని ట్వీట్లు రాసేస్తున్నారు. ఇప్పుడు నానీ మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతున్న‌ది.

Latest News