Site icon vidhaatha

ఇండియన్‌ ఐడల్‌-12 విజేత పవన్‌దీప్‌ రాజన్‌

షణ్ముఖప్రియకు ఆరోస్థానం
విధాత,ముంబయి: అందరిలో ఉత్కంఠ రేపి ఆదివారం ఏకబిగిన 12 గంటలపాటు సాగిన పాపులర్‌ మ్యూజికల్‌ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌-12 తుది పోటీల్లో తన అద్భుత గానంతో ప్రతిభ చూపిన పవన్‌దీప్‌ రాజన్‌ ట్రోఫీతోపాటు రూ.25 లక్షల నగదు బహుమతి గెలుచుకొని విజేతగా నిలిచాడు. దీంతో తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. విశాఖకు చెందిన తెలుగమ్మాయి షణ్ముఖప్రియ ఆరోస్థానంలో నిలిచింది. ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపి ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఫైనల్‌ షో అర్ధరాత్రి వరకు సాగింది. గ్రాండ్‌ ఫినాలేకు ‘షేర్షా’ జంట సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యాజ్ఞిక్‌ అతిథులుగా విచ్చేశారు.

Exit mobile version