Site icon vidhaatha

Krithi Shetty | బౌండ‌రీలు బ్రేక్ చేసిన బేబ‌మ్మ‌.. క‌శ్మీర్ యాపిల్‌లా కృతి తెగ మెరిసిపోతుందిగా..!

Krithi Shetty |

యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి. ఇందులో కృతి త‌న అందంచందాల‌తో ఆటు అభిన‌యంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ఉప్పెన సినిమా త‌ర్వాత కృతి న‌టించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ బ్యూటీ ల‌క్కీ హీరోయిన్‌గా మారింది.

ఇక వ‌రుస అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో ఓకే చెప్పేసింది.ఈ క్ర‌మంలోనే ‘ది వారియర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచెర్ల నియోజకవర్గం’ వంటి చిత్రాలు తీవ్ర నిరాశ‌ప‌రిచాయి. ఇక చివ‌రిగా నాగ చైత‌న్య‌తో క‌స్ట‌డీ అనే చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో అమ్మ‌డి ప‌రిస్థితి దారుణంగా మారింది. ఇటీవ‌ల సూర్య‌తో న‌టించే ఛాన్స్ అందుకున్న‌ప్ప‌టికీ అది ఆగిపోయిన‌ట్టు తెలుస్తుంది.

స‌రైన ఛాన్స్‌లు లేని ఈ భామ సోష‌ల్ మీడియాలో అందాల విందు చేస్తూ కుర్రాళ్ల‌కి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది. రెడ్ అవుట్ ఫిట్ లో కృతిశెట్టి అందాల విందు కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇలాంటి ఔట్‌ఫిట్‌లో బేబ‌మ్మ‌ని చూడ‌గానే కుర్ర‌హృద‌యాలు మ‌త్తెక్కిపోతున్నాయి.

ఆ అందాల‌ని చూసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డీప్ బ్యాక్, షోల్డర్ అందాలను చూపిస్తూ బేబమ్మ అందాల ఆర‌బోత నభూతో న‌భ‌విష్య‌త్ అన్న‌ట్టుగా మారింది. ఈ అమ్మ‌డు మెరిసిపోయే చర్మసౌందర్యం, ఊరించే పెదాలు, నిషా కళ్లు అంద‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. కృతి శెట్టి పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ఇక ఇప్పుడు కృతి శెట్టి జోరు టాలీవుడ్‌లో చాలా త‌గ్గింది. తెలుగులో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఈ భామ త‌మిళం, మలయాళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటేంది. ప్రస్తుతం మలయాళంలో ‘అజాయంతే రందం మోషణం’, ‘జీనీ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది కృతి.

ప్రస్తుతం ఈ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఒక్క మంచి హిట్ ప‌డిందంటే కృతి శెట్టి కెరీర్ మ‌రింత జోరు పెర‌గ‌డం ఖాయం. రానున్న రోజుల‌లో కృతి శెట్టి ఇండ‌స్ట్రీని ఏల‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. కాక‌పోతే ఈ భామ ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవ‌ల‌సి ఉంది.

Exit mobile version