Lavanya Tripathi: ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ ఏంటంటే.. నిహారిక, చైతన్య విడాకుల వ్యవహారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వారం రోజుల పాటు వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు తెగ హల్ చల్ చేశాయి. వీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని, పలువురికి ఆదర్శంగా నిలుస్తారని అందరు అనుకున్నారు. కాని ఊహించిన విధంగా నిహారిక-చైతన్యలు విడాకులు తీసుకున్నారు. జూన్ 5వ తేదీనే వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయగా, ఆ విషయం దాదాపు నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఇక విషయం ఎలాగు బయటకు వచ్చింది అనుకున్నారో ఏమో కాని నిహారిక, చైతన్యలు తమ విడాకులపై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని తన పోస్ట్‌లో తెలిపిన నిహారిక.. ఈ సమయంలో అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. కొత్త జీవితం ప్రారంభించడానికి కాస్త ప్రైవసీ కావాలని, అందరు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరి విడాకుల విషయంలో నిహారికదే తప్పు అని అందరు అంటున్నారు. సోషల్ లైఫ్ అంటూ పబ్‌లు, క్లబ్‌లకి వెళ్లడం వారికి నచ్చకనే విడాకులు ఇచ్చి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నిహారిక విడాకులతో లావణ్య త్రిపాఠికి గుండెల్లో భయం పుడుతుందట.
మెగా ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అని ఆ కుటుంబానికి తన కూతురిని కోడలిగా పంపిస్తుంటే, ఈ కుటుంబంలోని ఆడవారు ఇలా విడాకులు తీసుకుంటున్నారు ఏంటి అని ఆందోళన చెందుతుందట. అయితే లావణ్య త్రిపాఠి తల్లి చాలా తెలివైన వారు అంట.నిశ్చితార్థానికి ముందే వరుణ్ తేజ్ కి కండీషన్ పెట్టిందట. పెళ్లయ్యాక మీరు బయట విడిగా ఉండాలని, నిహారికతో పెద్దగా సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పుకొచ్చిందట. అలా చేస్తేనే నా కూతురిపై ఎవరు నెగెటివ్ కామెంట్స్ చేయరని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ఇందులో ఎంత నిజనిజాలు ఉన్నాయో తెలియవు కాని ప్రస్తుతం మాత్రం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.